రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట 18 మంది దుర్మరణం పట్టించుకోని ప్రభుత్వం | Delhi Railway Station Incident 18 members Died

Photo of author

By Admin

Delhi Railway Station Incident 18 members Died

ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్ఫామ్ నుంచి 16వ ప్లాట్ఫామ్కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.

రైతు ప్రస్థానం : ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్ఫామ్ నుంచి 16వ ప్లాట్ఫామ్కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతో కూడా ఒక్కసారిగా తోపులాట జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి.ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాహుల్ గాంధీ అన్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటన అద్దం పడుతోందని ట్వీట్ చేశారు.

మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారని తెలిసి కూడా స్టేషన్లో ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందన్నారు.ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలో రైల్వే ప్రమాదాలు పెరిగిపోయాయని, రద్దీకి అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. జనరల్ బోగీల సంఖ్యను చాలా వరకు తగ్గించారని, సాధారణ ప్రయాణికుల కష్టాలను పట్టించుకోవట్లేదని ఫైరవుతున్నారు.

FAQ

Leave a Comment