Telangana new ration cards guidelines released: కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు విడుదల
కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలను విడదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 26 నుంచి కొత్త కార్డుల మంజూరు కుల గణన ఆధారంగా అర్హుల ఎంపిక..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞత చెప్పింది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నా రేషన్ కార్డులకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సనాలు చేస్తోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి విధివిధానాలను విడుదల చేసింది. ఇప్పటికే 15ల నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. పెళ్లిళ్లు అయ్యే పిల్లలు కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు రాకపోవడంతో చాలామంది ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవడమే మానేశారు రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది పథకాలకు అయితే దూరం అయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా పథకాలు అందిస్తున్న కూడా రేషన్ కార్డులు లేక ఆ పథకాలకు అనర్హత పొంది ఉన్నారు వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతోపాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టర్లు, GHMC కమిషనర్కు అప్పగించింది. MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు.
అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వాళ్లకి రేషన్ కార్డు ఇస్తుంది అనేదానిపై స్పష్టత అయితే లేదు గతంలో కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు ఇస్తామని తెలిపింది ఒకవేళ దాన్ని కనుక అమలు చేస్తే చాలా మంది రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న వారికి అక్కడ ఇక్కడ రేషన్ కార్డు ఉండకూడదని కేవలం ఎక్కడో ఒక దగ్గర రేషన్ కార్డు ఉంటుందని రాష్ట్రం స్పష్టం చేసింది వన్ స్టేట్ వన్ రేషన్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది ఎక్కడైనా ఒక దగ్గర మాత్రమే రేషన్ కార్డు ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో మార్పులకూ అవకాశం కల్పిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులను జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ మరియు రేషన్ కార్డుకు కనెక్షన్ కట్ చేయనున్నట్టు తెలిపింది.
కొత్తగా 10 లక్షల కార్డులు ఇస్తామని చెప్పిన ఆయన, వీటి వల్ల 36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి చేసుకున్న 18 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.