Aadhar Enrollment Center Notification In tg | Aadhar Enrollment Center | ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ విడుదల 2025

Photo of author

By Admin

Aadhar Enrollment Center Notification In tg | Aadhar Enrollment Center | ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ విడుదల 2025

నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న  యువతీ యువకులకు ఇదో సువర్ణ అవకాశం ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత తో సొంత జిల్లాలో ఉద్యోగం చేస్తూ నెలకు 50,000/- రూపాయల వరకు జీతం పొందే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలలోని CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆధార్ సేవా కేంద్రాలలో పనిచేసేందుకు UIDAI సంస్థ నుండి ఆధార్ ఆపరేటర్ మరియు ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు అనేది ఇప్పుడు చూద్దాం ..

మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 23 రాష్ట్రాలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా, తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ లో 8. తెలంగాణ లో 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న ఖాళీలు ప్రాంతాల వారీగా
  • కృష్ణ – 01
  • శ్రీకాకుళం – 01
  • తిరుపతి – 01
  • విశాఖపట్నం – 03
  •  విజయనగరం – 01
  •  వైఎస్ఆర్ – 01
తెలంగాణలో ఉన్న ఖాళీలు ప్రాంతాల వారీగా
  1. అదిలాబాద్ 01
  2. కరీంనగర్ – 01
  3.  భద్రాద్రి కొత్తగూడెం – 01
  4.  మహబూబాబాద్ 01
  5. మహబూబ్ నగర్ 01
  6. మెదక్ – 01
  7.  మూలుగు – 01
  8.  నల్గొండ – 01
  9.  నారాయణ పేట – 01
  10. నిర్మల్ – 01
  11. నిజామాబాద్ – 01
  12. పెద్ద పల్లి – 01
  13. రంగా రెడ్డి – 01
  14. వికారాబాద్- 01
  15. వనపర్తి – 01
  16. యాదాద్రి భువనగిరి – 01

ముఖ్యమైన తేదీలు:

  • ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తేది: 31/01/2025 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • తెలంగాణా అభ్యర్థులు తేది: 28/02/2025 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం:

  • అభ్యర్థులకు సెమీ-స్కిల్డ్ మ్యాన్పవర్కు సంబంధించి రాష్ట్ర కనీస వేతనాలు నిర్ణయించబడతాయి.
  • వీరికి వారు చేసే సర్వీసులు ఆధారంగా జీతం లభిస్తుంది.

విద్యార్హత:

  1. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
  2. పై అర్హతల తో పాటు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్. పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్ :
  1.  ఈ ఉద్యోగాలకు ఏ జిల్లాలలో ఖాళీలు వున్నాయో ఆ జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  2.  అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ మరియు రెస్యూమ్ లను అప్లోడ్ చేయవలసి వుంటుంది.
  3.  ఆధార్ సర్టిఫికెట్ లేని వారు క్రింది లింక్ ద్వారా ఆధార్ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకోగలరు.

Aadhar Certificate

Click Here For Apply

Leave a Comment