KTR under fire on Formula-E case On Revanth : తనపై పెట్టిన కేసులో ఏమీ లేదని, అదో లొట్టపీసు కేసు 2025

Photo of author

By Admin

KTR under fire on Formula-E case On Revanth : తనపై పెట్టిన కేసులో ఏమీ లేదని, అదో లొట్టపీసు కేసు 2025

తనపై పెట్టిన కేసులో ఏమీ లేదని, అదో లొట్టపీసు కేసు అని KTR మరోసారి ఆరోపించారు. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీది అవినీతిలానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి brs వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను ఫార్ములా ఈ లో అవినీతి చేసారంటూ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే తనపై పెట్టిన కేసులో ఏమీ లేదని, అదో లొట్టపీసు కేసు అని KTR మరోసారి ఆరోపించారు. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీది అవినీతిలానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి లేదని తెలిసీ తనపై కేసు పెట్టి కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగపరంగా తనకున్న హక్కు ప్రకారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానన్నారు. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే నిన్న తాను ACB విచారణకు హాజరయ్యానని KTR తెలిపారు. కక్ష సాధింపు కేసు అని తెలిసి కూడా వెళ్లానన్నారు. తన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఏదో ఉరిశిక్ష పడినట్లు కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులైతే న్యాయమూర్తుల్లా ఫీలవుతున్నారని సెటైర్లు వేశారు. న్యాయపరంగా ఈ అంశంపై పోరాటం చేస్తానని, లాయర్లతో విచారణకు వెళ్తానని KTR స్పష్టం చేశారు.

KTR under fire on Formula-E case On Revanth
KTR under fire on Formula-E case On Revanth

తాను పైసా అవినీతి కూడా చేయలేదని పచ్చకామెర్లున్న వారికి లోకం పచ్చగానే కనిపిస్తుందని విమర్శించారు. తాను రాజ్యాంగ హక్కును వినియోగించుకొని పోరాటం చేస్తానని తెలిపారు. రేవంత్కు ఆసక్తి పార్ములా-ఈపై ఉంటే తమ ఆసక్తి ఫార్మర్పై ఉందని చెప్పారు. కాంగ్రెస్ విధానం డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్, డిసెప్షన్ అని పేర్కొన్నారు. రేవంత్ ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలు చేసినా తనను ఏమీ చేయలేరన్నారు.రాష్ట్రంలో ఓ కాంట్రాక్టర్ మంత్రిగా, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేఘా ఇంజినీరింగ్ను నిషేధించాలని ఆదేశాలున్నా ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. వారి నుంచి కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలపై మరిన్ని కేసులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని కేటీఆర్ తెలిపారు.

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆయన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఈ ఉదయం తోసిపుచ్చడం తెలిసిందే. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ తనపై ACB కేసులు కొట్టివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు KTR పిటిషన్ వేస్తే విచారణలో తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే SCలో కేవియట్ వేసింది.లాయర్ల సమక్షంలోనే తన విచారణ జరగాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్లు KTR వెల్లడించారు. తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతానన్నారు. విచారణకు లాయర్లతో రావొద్దని చెబుతున్నారని, ఇలానే వెళ్లిన తమ పార్టీ నేత పట్నం నరేందర్రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్లు ఇచ్చినట్లు బుకాయించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నపై అక్రమ కేసులు పెట్టారని, సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.

Leave a Comment