Mohan Babu Attack on Journalist : మోహన్ బాబు వలన జైగోమాటిక్ బోన్ విరిగింది 2024

Photo of author

By Admin

Mohan Babu Attack on Journalist : మోహన్ బాబు వలన జైగోమాటిక్ బోన్ విరిగింది 2024

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దాడి చేసిన మీడియా ప్రతినిధికి జైగోమాటిక్ ఎముక విరిగినట్టు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.. దీంతో మీడియా ప్రతినిధులు ఫిలింఛాంబర్ వద్ద ధర్నాకు దిగారు..

గత మూడు రోజులు నుండి మోహన్ బాబు ఫ్యామిలీ పై కాంట్రవర్సీ చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన వీడియో కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధి పై మోహన్ బాబు విచక్షణారహితంగా దాడి చేయడంపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు… ఈరోజు ఫిలిం ఛాంబర్ వద్ద మీడియా ప్రతినిధులు భారీ ఎత్తున నిరసనకు దిగారు మా అసోసియేషన్ నుంచి మంచు ఫ్యామిలీని తొలగించాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించి మంచి ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ మీడియా ప్రతినిధులకు సపోర్ట్ చేశారు..

నిన్న రాత్రి మోహన్బాబు TV9 రిపోర్టర్పై మైక్తో దాడి చేసిన విషయం తెలిసిందే. గాయపడ్డ బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి స్కానింగ్ తీయగా దవడ పైభాగంలో ఉండే జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల విరిగినట్లు తేలింది. దీంతో అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. మరోవైపు తమపై దాడి చేసిన మోహన్బాబుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన ముంచు విష్ణు ఆల్రెడీ గాయపడ్డ జర్నలిస్ట్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నామని వారికి చెప్పాల్సింది మేము అప్పుడే చెప్పామని వారికి సంబంధించి పూర్తి వివరాలు ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులు కూడా భరిస్తామని చెప్పామని విష్ణు తెలిపారు..

హైదరాబాద్ జల్పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు.ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Leave a Comment