AP New Ration Cards Applications start Date: కొత్తగా పెళ్లయిన వారు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో తమ పేర్లు తొలగించుకోవలసి ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులను స్వీకరించబోతుంది.సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులను స్వీకరించబోతుంది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ నుంచి అప్లై చేసుకునేందుకు వీలు కల్పించింది దీంట్లోనే కొత్తగా పెళ్లయిన వారు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో తమ పేర్లు తొలగించుకోవలసి ఉంది అలాగే కొత్తగా పెళ్లయిన కుటుంబం గా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఇంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను సప్లై చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గత రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పై మాజీ సీఎం జగన్ దేవాంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఉండటం ప్రస్తుతం సర్కారుకు నచ్చకపోవడంతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది కొత్త రేషన్ కార్డులను పసుపు రంగులో ఉండేలా ఏపీ రాజముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తోంది ఈ పసుపు రంగు ఉండటంపై కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. టిడిపి జెండాల రంగును రేషన్ కార్డులకు ఎంపిక చేయడం సరికాదని కొందరైతే అంటూ ఉన్నారు. వైసీపీ చేసినట్లే టిడిపి కూడా చేస్తుందని కొంతమంది చెప్తూ ఉన్నారు అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తూ వుంది. దీని ప్రకారం సంక్రాంతి పండుగ నాడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా జిల్లాలో అధికారులు ప్లాన్ చేసుకుంటున్నారు.
కొత్త రేషన్‌కార్డులకు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కార్డుల్లో మార్పులు, కొత్తగా పెళ్లయిన వారు అప్లై చేసుకోవడానికి వీలుగా ఆప్షన్లను ఇవ్వనుంది. పాత కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. జనవరి నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తిచేయనుంది.కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.