TS samgra kutumb surve forms on the road: సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు జాతీయ రహదారిపై
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు అయ్యాయి.
అర కిలోమీటర్ పొడవునా జాతీయ రహదారి పక్కన దర్శనం.. సిబ్బందితో కమిషనర్ సేకరణ సమగ్రకుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలయ్యాయి. జాతీయ రహదారి పొడవునా ఫారాలు దర్శనమిచ్చాయి.మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శమిచ్చాయి.
ఈ విషయంపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీనా సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు.దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కన్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయమైన కమిషనర్ ను వివరణ కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే పడి ఉన్నట్టు తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి, దరఖాస్తులను సేకరించామన్నారు. అర కిలో మీటర్ మేరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ ప్రజా పాలన పత్రాలు కూడా ఇలా రోడ్డుపై కనిపించాయి పలువురు అధికారులు తోపాటు సిరిజనులు అడగ్గా తమకు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్రని చెప్పారు. ఇలా డటాను తారుమారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్న లేదా అనేదానిపై ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు అసలు ప్రభుత్వం పథకాలు ఇచ్చే ఆలోచన ఉందా లేదా ఊరికే కాలక్షేపానికి మాత్రమే కుటుంబ సర్వే చేస్తుందా అని పలువు ఎటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.