Tummala nageshwar rao Said good news to farmers: రైతులకు రాయితీ తో ట్రాక్టర్ పంపిణీ
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వ్యవసాయానికి అవసరమైన పనిముట్లను రాయితీతో పంపిణీ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేసింది త్వరలోనే రైతు భరోసా కూడా రైతుల ఖాతాలో చెమ చేయడానికి సన్నహాలు చేస్తోది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగపడే పనిముట్లను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాలు చేస్తోంది త్వరలోనే రైతులకు పనిముట్లు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలక్షన్ హామీలు ఇస్తానన్న వరి బోనస్ 500 రూపాయలను ఇవ్వడానికి 1000 కోట్లను అయితే మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది 500 రూపాయల బోనస్పూర్తి అయిన వెంటనే యాసంగి నుంచి వ్యవసాయానికి అవసరమయ్యే ఉపకారణాలను ప్రభుత్వం రాయితీ ఇచ్చి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తోది. వ్యవసాయానికి అవసరమయ్యే రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్ల మరియు ఇతర పరికరాలను అందజేయడానికి ప్రభుత్వం సన్నాలు చేస్తోంది దీనికి సంబంధించి ఎలా సెలెక్ట్ చేస్తారు అనే దాని గురించ రాష్ట్ర ప్రభుత్వం బహింట్ అయితే ఇవ్వడం జరిగింది.
పనిముట్ల అవసరం ఎక్కడైతే అంటే ఏ జిల్లాలో అయితే ఎక్కువగా అవసరం పడుతున్నాయో అక్కడున్న డిమాండ్ ప్రకారం పనిముట్లను రాయితీతో రైతులకు అందిస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక పనిముటకి ఒక జిల్లాలో ఎంత ఆదరణ ఉంది దానికి ఎంత డిమాండ్ ఉంది అనే దానిపై సబ్ కమిటీ వేసి దాన్ని నివేదికను తయారు చేసుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది ఆ నివేదిక ప్రకారం రైతులకు పనిముట్ల అందజేత ఉంటుందని అన్నారు..
యంత్రాల తయారీ సంస్థల సహకారంతో అన్నదాతల్లో అవగాహన కల్పించేందుకు గాను జిల్లాల వారీగా ప్రదర్శనలు సైతం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అన్నాదతలకు ట్రాక్టర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, తైవాన్ స్ర్పేయర్లు, మొక్కజొన్న ఒలిచే యంత్రాలు, కిసాన్ డ్రోన్లను ప్రతిపాదించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం రైతులకు పనిముట్లు ఇవ్వకపోవడం వల్ల అలాగే రైతులకు ఆ పనులు ముట్టు గురించి ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని దానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనిముట్టు తయారీ సమస్త ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని అన్నారు.రైతులకు యాసంగి సీజన్ నుంచే ఈ స్కీం ద్వారా వ్యవసాయతర ఉపకరణాలు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది.