Farmers Fire On CM Revanth Reddy for IKP: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న రైతులు..గద్దె దింపుతాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై రైతులు గుర్రుగా ఉన్నారు. పంటను కోసి ఐకేపీకి తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నా కూడా కొన నినాదాలు అంటూ ఎవరూ లేరని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల నుండి వ్యతిరేకత రావడం స్టార్ట్ అయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు హామీలతో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఇంతవరకు రైతులకు సంబంధించి కేవలం రెండు లక్షల వరకు రుణమాఫీ మాత్రమే మాఫీ చేశారు మిగిలిన రైతు భరోసా ఇంతవరకు రైతులకు అందించింది లేదు కనీసం వారికి ఏ రోజు వేస్తామన్నది కూడా స్పష్టత లేదు.తడిసిన వడ్లను ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా ? ఎప్పుడు వడ్లు తేమ తీరిన తరువాత ఐకేపీ కి తీసుకు వస్తేయ్ ఇరవై రోజులైనా కొనకపయ ప్రభుత్వం
దీంతో రైతులు తమకు ఒక రైతు రుణమాఫీ కాలేదంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే అయితే కొంతమంది రైతులు పంట చేతికి వచ్చే చాలా రోజులవుతున్న కూడా ఇప్పటివరకు ఐకేపీలు పనిచేయడం లేదంటూ దీనివల్ల వచ్చిన వర్షాలకు మొత్తం నీరు గారి పోతుందని పలు రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వలేదని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చోట రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను ఐకెపికి తీసుకువచ్చి 20 రోజులు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు ఐకేపీలు పనిచేయడం లేదంటూ రైతులు తడిసిన పంటతో అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు.
అకాల వర్షాల వల్ల తన ధాన్యం తడిసిపోయినట్టు ఓ రైతు వీడియోని షేర్ చేశాడు ఆ వీడియోలో గత ప్రభుత్వం పది రోజుల్లోనే ఐకెపిలో ఉన్న ఓట్లన్నీ కొనేసిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐకెపికి ఓట్లు వచ్చి 20 రోజులు అవుతున్న కూడా ఇంతవరకు ఓట్లను కొనలేదని స్పష్టం చేసింది కాంగ్రెస్ నేతలు వచ్చి ఐకెపిలను ఓపెన్ చేయడం కాదు వాటిని కొనే విధంగా చూడాలని అన్నారు.
దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించాలని అలాగే సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి స్పందించాలని నా రైతు కోరారు. ఆరుగాలం కష్టం చేసే పండించిన పంటను ఇలా పారబోసుకోవడానికా మేము చేసుకునేది అని ఆ రైతులు మండిపడుతున్నారు ఈ రైతు చేసిన వీడియోని షేర్ చేస్తూ కేసీఆర్ స్పందించారు ఎక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ విమర్శించారు. ‘వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ బిజీబిజీగా ఉన్నాడు’ అని రైతు వీడియోను KTR ట్వీట్ చేశారు.