మట్టి + ఆముదం + కుంకుడు కాయలు : సేంద్రియ ఎరువులు వాడి పంటలను కొత్తరకంగా సాగు చేస్తున్నారు 2024
రైతులు ప్రతి ఒక్కరు రసాయనిక ఎరువులను వాడి పంటలను పండిస్తున్నారు.కానీ కొంతమంది రైతులు మాత్రం సేంద్రియ ఎరువులు వాడి పంటలను కొత్తరకంగా సాగు చేస్తున్నారు వారి గురించి తెలుసుకుందాం..
ఒకప్పుడు రైతులు వారి మరియు ఇతర కూరగాయల పంటలు పండించాలి అంటే సేంద్రియ పద్ధతులు వాడి వివిధ రకాల పంటలను పండించే వారు కానీ రోజులు మారుతున్న కొద్దీ భూమి సారం అధిక రసాయనిక ఎరువుల వాళ్ళ తగ్గిపోయింది.దీంతో కల్తీ కూడా పెరిగిపోవడంతో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో బాధలు పడుతున్నారు కొంత మంది వ్యవసాయం మానేస్తే ఇంకొంతమంది యువ రైతులు పాతకాలం లో వాడిన పద్ధతులనే వాడి అధిక సంఖ్యలో దిగుబడిని రాబట్టుకుంటున్నారు. పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు.
ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు.కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు.
ఎరువును తయారు చేసుకునే పద్ధతి
- బాగా జిగటగా ఉండే మట్టి 10 కిలోలు తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధంచేసుకోవాలి.
- ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి.
- . 250 నుండి 500 గ్రా.ల కుంకుడు కాయలు తీసుకొని నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి.
- వాటిని ఉదయం చేతితో పిసికి, గింజల్ని తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి.
- అలా పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పెట్టిన మట్టిలో వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి.
- మట్టి మిశ్రమం నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు అడుగున పేరుకుంటాయి.
- పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి.
- రైతులు ముఖ్యంగా మట్టి దావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా పంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.
- ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది.
పురుగు పైకి కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం పురుగుల నియంత్రణకు చల్లితే బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది.
మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది.