Yuva Vikasam Scheme Inaugurated in Cm Revanth: తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ,ఉపాధి సాధన 2024

Photo of author

By Admin

Yuva Vikasam Scheme Inaugurated in Cm Revanth: తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ,ఉపాధి సాధన

తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ,ఉపాధి సాధన

రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే

ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తి

పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనుల

కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు.ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో పెద్దపల్లిలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Youva Vikasam
Youva Vikasam

Yuva Vikasam Scheme:  TGPSC ద్వారా గ్రూప్ IV కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి, సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను లాంఛనంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు.SkillsUniversity తో కలిసి పని చేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కూడా కుదిరాయి. అలాగే, అత్యంత కీలకమైన Digital Employment Exchange of Telangana (DEET) ఏర్పాటును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అలాగే CM’s Cup -2024 ట్రోఫీని ఆవిష్కరించారు.

Yuva Vikasam Scheme
Yuva Vikasam Scheme

అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన పదేండ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ,ఉపాధి సాధన కోసం జరిగిన కాబట్టి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు.ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు.నిరుపేదల బిడ్డలు చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు.

Telangana Schemes
Telangana Schemes

కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు.పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు.కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం.గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశాని చెప్పారు. తొలి సంవత్సరంలో 21 వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాని చెప్పారు.

Telangana logo
Telangana logo

నిర్భందాల మధ్య సాగిన పదేండ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు.ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Comment