Vavilaku Kills flies with in a second 2025
వ్యవసాయం ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్న రంగం ఈ రంగంలో ఎక్కువగా రసాయనిక వ్యవసాయాలే ఎక్కువ మనం మాత్రం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చిట్కా తెలుసుకుందాం..
మన చుట్టూ ఉన్న ఎన్నో రకాల మొక్కలు ఎన్నో ఔషధ గుణాలని కలిగి ఉన్నాయి.మనం గుర్తించిన కూడా మనం మాత్రం మన పంటలకు ఉపయోగించము ఎందుకంటే మన కన్నా ఎక్కువ మన పక్కోడిపైనే మనకు ఆలోచన ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో చివరి దశల్లో ఉంది.కాబట్టి ఇప్పుడు ఎక్కువగా దోమ కాటు,పచ్చ పురుగు ,రెక్క పురుగు వంటి కీటకాలు పంటను ఎక్కువ మొత్తంలో నష్ట పరుస్తూ ఉంటాయి,కాబట్టి మనం వాటికి సేంద్రియ పద్ధతిలోను నివారణ చేయోచ్చు.దానికి సంబంధించి ఎం చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పడు చూద్దాం..
కావలసినవి
- వావిలాకు (Chinese chastetree)
- నీళ్లు
- బొక్కెన లేదా పటువ
- కుంకుడు కాయలు
తయారు చేయు విధానం
- మొదటగా 5 కేజీల వావిలాకును తీసుకోవాలి.
- 5 లీటర్ల నీటిలో అర్ధ గంటా మరిగించాలి.
- మధ్య మధ్యలో మూతికి గుడ్డ కట్టుకుని కలబెడుతూ ఉండాలి.
- బాగా మరిగిన తరువాత చల్లర నివ్వాలి.
- ఆ తరువాత వడపోసుకోవాలి .
- ఈ మిశ్రమానికి 5 కేజీల కుంకుడు కయ రాసాని కలుపుకోవాలి.
- కుంకుడు కాయలు అందుబాటులో లేక పోతే సబ్బు నీళ్లు ఐన కలుపు కోవాలి.
పిచ్చి కారి
20 లీటర్ల పుంపుకు 2 లీటర్ల మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఫలితాలు
ఈ మిశ్రమాన్ని వాడడం వలన వరి మరియు మిరప తోటలలో ఉండే పచ్చ పురుగు రెక్క పురుగు మరియు ఇతర కీటకాలను చంపి వేస్తుంది.