ధాన్యం సేకరణకు కొనుగోలు కష్టం | Uttam Kumar Reddy Shocking Comments on Rice 2025

Uttam Kumar Reddy Shocking Comments on Rice

ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు సహకరించాలనీ, లేదంటే కొనుగోలు కష్టం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.

ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు సహకరించాలనీ, లేదంటే కొనుగోలు కష్టం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో మంచి వర్షాలు కురవడంతో రైతులు భారీగా వరి సాగుచేశారని అన్నారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని దీంతో మిల్లింగ్, రవాణా, స్టోరేజీలో తీవ్రమైన సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇదే పరిస్థితి గనుక కొనసాగితే రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్, డెలివరీ నిలిపివేస్తారని దీని వల్ల లక్షల మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి, కేంద్ర కార్యదర్శి సంజీవ్ లేఖలు రాశారు.

ఉత్తమ్ దిల్లీ వెళ్లాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో పర్యటన వాయిదాపడింది. దీంతో పరిస్థితి తీవ్రతను వివరిస్తూ లేఖలు పంపించారు.తెలంగాణాలో ఎఫ్సీఐ గోదాముల సామర్థ్యం 22.61 లక్షల టన్నులు ఉండగా ఇప్పటికే అవి 21.72 లక్షల టన్నుల బియ్యంతో నిండిపోయాయి అని తెలియజేసారు . కొత్తగా వచ్చే బియ్యాన్ని నిల్వ చేసే జాగా లేక మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ ఆపేస్తారు. కిక్కిరిసిన ఎఫ్సీఐ గోదాములను వెంటనే ఖాళీ చేయించడానికి నెలకు కనీసం 300 ప్రత్యేక రైళ్లు ఇవ్వండి అని కోరారు. అదనపు స్టోరేజీ కోసం ఎఫ్సీఐ గోదాములను లీజుకు తీసుకోవాలి అన్నారు .

కేంద్రం మాకు 53.73 లక్షల టన్నుల ధాన్యం సేకరణకే అనుమతించింది. ఈ నిర్ణయాన్ని మార్చుకుని 80 లక్షల టన్నులకు అనుమతివ్వాలి అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం అవుతుంది. గత ఏడాది 67 లక్షల టన్నుల వరకు సేకరణ జరిగింది. తెలంగాణలో ఇప్పుడు 148.30 లక్షల టన్నుల దిగుబడి రానుంది. రాష్ట్రం సేకరించే ధాన్యంలో సన్నాలే 45-50 లక్షల టన్నులు ఉండనున్నాయి.

2024-25 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ డెలివరీకి గడువును నవంబరు 12గా పేర్కొంటూ బాయిల్డ్ రైస్ గా మాత్రమే సరఫరా చేయాలన కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవరించి ఖరీఫ్ ధాన్యం ముడి బియ్యానికి అనుకూలంగా మిల్లర్ల దగ్గర 7.80 లక్షల టన్నులు రారైస్, 1.67 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఉన్నాయి. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని రా రైస్, బాయిల్డ్ రైస్ డెలివరీకి అనుమతివ్వాలి అని కోరారు. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని రబీ సీజన్కు మార్చాలి” అని మంత్రి ఉత్తమ్ లేఖల్లో పేర్కొన్నారు.

క్వింటాకు రూ.2,389 కనీస మద్దతు ధరతో సేకరణకు దాదాపు రూ.20 వేల కోట్ల ఖర్చవుతుంది. బోనస్ చెల్లింపులు, రవాణాతో కలిపి మొత్తం ఖర్చు రూ.24 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరుగుతుంది.

Leave a Comment