ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి షాకింగ్ న్యూస్ | ts aasara pension status check by aadhar card 2025

ts aasara pension status check by aadhar card

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి ఓక షాకింగ్ న్యూస్ చెప్పింది,దీని ద్వారా పెన్షన్ తీసుకునే వారికి పెన్షన్ రాకుండా చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ తీసుకునే వారికి శాసికింగ్ న్యూస్ చెప్పింది దీని వలన పెన్షన్ తీసుకునే వారిలో సగం మందిని పెన్షన్ జాబితా నుండి తొలగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.ఇప్పటికే చాల మంది పెన్షన్ దారులకు రద్దు చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు మంత్రి పార్ధ సారధి.ఎన్టీఆర్ భరోసా కింద దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని భావిస్తున్న ప్రభుత్వం అనర్హులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే పలువురి పింఛన్లను రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు జారీ చేస్తున్నారు.

ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అనర్హులకు కూడా దివ్యాంగ పింఛన్లు ఇచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.దీనితొ మా ప్రభుత్వం అనర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించామన్న మంత్రి రాష్ట్రంలో ఉన్న మొత్తం పింఛనుదారులు 4.50 లక్షల మంది కాగా పింఛన్ల లబ్ధిదారులలో లక్ష మంది అనర్హులను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చామని నోటీసులు అందుకున్న వారు రీ వెరిఫై చేయించుకోవాలని సూచించారు.వారు పునఃపరిశీలన చేయించుకోకపోతే అలాంటి వారికి మళ్లీ నోటీసులు ఇస్తామని అయిన కూడా పునఃపరిశీలనకు ముందుకు రాకపోతే, వారి పింఛన్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో ఎవరినైనా వైద్యులు అనర్హులని చెప్పి నోటీసులు వస్తే వారు అప్పీలు చేసుకోవాలని మంత్రి పార్థసారథి అన్నారు . ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ వద్ద అర్జీ పెట్టుకుంటే మరోసారి పరిశీలిస్తామని చెప్పారు.కొత్త దివ్యంగులను పెన్షన్ దారులుగా చేర్చుకొని అనర్హులను ఏరివేయడం కోసం సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొత్త శిబిరాల ద్వారా వైకల్య శాతాన్ని వైద్యులు పరిక్షిస్తారని అన్నారు.40 శాతం కంటే వైకల్యం తక్కువ ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలాంటి వారికి సెప్టెంబరు నెల పింఛను నిలిపేస్తూ, అందుకుగల కారణాలు వివరిస్తూ నోటీసులు ఇస్తున్నారు. పింఛన్‌ రద్దు అయినట్లు లబ్ధిదారులు నోటీసులు అందుకుంటే వారు మున్సిపల్‌ కమిషనర్‌ లేదా ఎంపీడీవో కార్యాలయంలో అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. వారు తమ

  • ఆధార్‌కార్డు
  • పింఛన్ మార్పు నోటీసు
  • సదరం సర్టిఫికేట్ పాతది కొత్తది తీసుకుని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఏ రోజు ఏ ఆసుపత్రికి రీవెరిఫికేషన్‌కు వెళ్లాలో సచివాలయాల ద్వారా అప్పీలుదారులకు నోటీసులు పంపుతారు. ఆ నోటీసులో ఇచ్చిన వివరాల మేరకు రీవెరిఫికేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉందని భావిస్తే దివ్యాంగుల పింఛన్ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు.

Leave a Comment