Top 15 Intresting Amazing Facts
మనం ఎప్పుడూ మాట్లాడుకునే ఎవరెస్ట్ పర్వతం ఎలా ఏర్పడింది.మనం రోజు వాడే QR కోడ్ ఎవరు తయారు చేశారు..మనం జాలీగా త్రాగాలి అంటే 43 లక్షలు చెల్లించాలా? చీమలు ఒక ప్రాణాన్ని కాపాడితే అని మీకు తెలుసా
మనం ఎక్కువగా మాట్లాడుకునే ఎవరెస్ట్ పర్వతం ఒకప్పుడు టెథీస్ మహాసముద్రం యొక్క అడుగు భాగనా ఉండేదట.50 మిలియన్ సంవత్సరాల క్రితం, భారత టెక్టోనిక్ ప్లేట్ ఉత్తరం వైపుకు కదులుతూ యురేషియన్ ప్లేట్‌ను ఢీకొట్టింది. అందువల్ల భూమి యొక్క క్రస్ట్ ముడతలు పడి ముడుచుకుని, సముద్రపు అడుగుభాగంలోని రాళ్లను, ఎవరెస్ట్ శిఖరంగా మారే అవక్షేప పొరలను ఆకాశం వైపుకు నెట్టింది.దాని వల్ల ఎవరెస్ట్ ఏర్పడింది అని చెబుతారు.శిఖరంపై ఉన్న సున్నపురాయిలో బ్రాచియోపాడ్స్ మరియు క్రినోయిడ్స్ వంటి సముద్ర జీవుల శిలాజాలు ఉన్నాయి.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న చెట్టుగురించి ఎప్పుడైనా మీరు విన్నారా? ఇక్కడ కనిపిస్తున్న మర్రిచెట్టు దాదాపు 4.6 ఎకరాల వరకు విస్తరించి ఉంది.ఈ దాదాపు 3770 వీలతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.ఇది బెంగాల్లో హౌరాలో ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద న్యూడ్ బోట్ ఏటా FEB 9-20 మధ్య USలోని మియామీ నుంచి కరేబియన్ దీవుల చుట్టూ 11 రోజుల పాటు ప్రయాణిస్తుంది. దుస్తుల్లేకుండా ప్రయాణించే వెసులుబాటు ఉండటం దీని ప్రత్యేకత. వినోదం కోసమే కాకుండా, తమ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే భావనను దీనిద్వారా ప్రోత్సహిస్తారు. ప్రయాణికులు రూ.43 లక్షలు చెల్లించాలి. బేర్ నెసెసిటీస్ అనే US లోదుస్తుల సంస్థ 1990 నుంచి ఇలాంటి ప్రయాణాలను చేపడుతోంది.
హిందీ సినీ రంగంలో 1932 తర్వాత ఎక్కువగా హీరో పాత్రల్లో కనిపించిన నటుల్లో పైడి జైరాజ్ ఒకరు. హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, గుజరాతీ తదితర భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించిన జైరాజ్, తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక సినిమా చేయాలనుకున్నా, నాగయ్య మృతితో అది ఆగిపోయింది. కరీంనగర్కు చెందిన ఆయన అసలు పేరు పైడిపాటి జైరుల నాయుడు. సరోజినీ నాయుడు భర్తకు జైరాజ్ మేనల్లుడు.
ఒక తల జార్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.లిస్బన్లోని యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్లో డియోగో ఆల్వెస్ తల పోర్చుగల్లో ఉన్న మొదటి సీరియల్ కిల్లర్. ఇతను 200 అడుగుల ఎత్తున్న Aqueduct (నీటి కుంట) దగ్గర రైతులను దోచి కిందకు తోసేసేవాడు. 70 మందిని చంపాడు. చివరకు అతన్ని ఉరి వేశారు.కానీ ఫ్రైనాలజీ చదవాలని, అతని తలను scientific study కోసం జార్లో నిల్వ పెట్టారూ.
ఈ మహిళ నిద్రపోవడాన్ని చూడాలి అంటే ఏకంగా 43 లక్షలు చెల్లించాలి.32ఏళ్ల బ్రెజిలియన్ ఇన్ఫ్లుయెన్సర్ డెబోరా పీక్సోటో రోజు రాత్రి సుమారు 40 మంది నన్ను లైవ్లో చూస్తారనీ వాళ్ళు చూస్తునందుకు నేను ఒక్కో వ్యక్తి నుంచి రూ.9,500 వసూలు చేస్తా,” అని ఆమె చెప్పారు. తాను నిద్రపోవడం చూసి, నెటిజన్లు ఓ రకమైన ప్రశాంతత, సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందుతారని అన్నారు.
1999 సం.రం లో జోన్ ముర్రే (మహిళా స్కె డైవర్) 14500 అడుగుల ఎత్తు నుండి పారాచూట్ ఫెయిల్ అయ్యి భూమిని డీకొని తీవ్రమైన గాయాలతో, ఎముకలు విరిగి షాక్ లో కార్డియాక్ అరెస్ట్ అయ్యి, గుండె పనిచేయడం ఆగింది. కానీ అదృష్టవశాత్తు ఆమె పడిన ప్రదేశం “FIRE ANTS చీమల కాలనీ”. ఆమెను ఆ సమయంలో దాదాపు 200 FIRE ANTS కుట్టడం వలన ఆ చీమల్లో ఉండే “సోలెనోప్సిన్” అనే విషం కారణంగా ఆమె గుండె తిరిగి పనిచేసింది. రెస్క్యు బృందాల సహాయంతో, ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగిన రెండేళ్ళ తర్వాత ఆమె మరలా స్కె డైవింగ్ చేసింది.
దుబాయ్, $35 బిలియన్ల ఖర్చుతో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఈ విమానాశ్రయంలో 400 గేట్లు, 5 రన్వేలు ఉండనున్నాయి. ఇది 260 మిలియన్ల (26 కోట్ల) మంది ప్రయాణికులకు సేవలందించగలదు.
రైలులో చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుంది అని మనకు తెలుసు. అయితే ఎవరు లాగారో ఎలా తెలుసుకుంటారో తెలుసా? ప్రతి బోగీలో ‘చైన్ పులింగ్ బ్రేక్’ వ్యవస్థ ఉంటుంది. చైన్ లాగినప్పుడు బోగీలో లైట్ (ఫ్లాష్) వెలుగుతుంది లేదా బజర్ వింటారు. ఈ ఫ్లాష్ వెలిగిన బోగీని రైల్వే అధికారులు గుర్తించి, ఆ బోగీకి వెళ్లి ఎవరు చైన్ లాగారో తెలుసుకుంటారు. తరువాత ఆ వ్యవస్థను రీసెట్ చేస్తారు, తద్వారా రైలు మళ్లీ కదలుతుంది.
మామూలుగా మనకు కరెంట్ ఎక్కడ నుండి వస్తుంది అని మనల్ని ఎవరైనా అడిగితే టక్కున వాటర్ నుండి బొగ్గు నుండి అని చెప్తాం.కానీ నైజీరియాకు చెందిన 4 మంది టీనేజ్ గర్ల్స్ మనిషి రిలీజ్ చేసే యూరిన్ ద్వారా కరెంట్ ఉత్పతి అయ్యే విధంగా ఒక జనరేటర్ ను తయారు చేశారు.కేవలం ఒక లీటరు యూరిన్ తో ఆరు గంటల విద్యుత్తును ఈ జనరేటర్ ఉత్పత్తి చేస్తుంది.
జంతువులకు మామూలు హాని అనేది ఇతర జంతువుల నుండి కలుగుతుంది.కానీ తన చావుకు కారణం అయ్యే ఆయుధాన్ని తానే పెంచుకొని జంతువు మీకు తెలుసా.చూడడానికి పందిని తలపించే ఈ జీవి పేరు “బాబిరూసా”. ఇవి ఎక్కువగా ఇండోనేషియా దేశంలో కనిపిస్తాయి.ఈ బాబిరూసా రకపు పందులలో మగ వాటికి వాటి ముక్కు పై నుండి రెండు కోరలు వాటి నుదురు భాగం వైపుకు తిరిగి పెరుగుతాయి.ఇవి పెరిగే క్రమంలో ఆ కోరలు కూడా పెరుగుతూ వాటి పుర్రె లోనికి చొచ్చుకుపోయి వీటి మరణానికి కారణం అవుతాయి.
సహజంగా ఏ జీవి అయినా పుట్టక కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోతుంది.కానీ అదే రోజు పుట్టి, అదే రోజు చనిపోయే జీవి ఉందని తెలుసా ఈ ప్రపంచంలో ఒక రోజు మాత్రేమే జీవితకాలం ఉన్న జీవి “MAY FLY” ఇవి గుడ్డు నుంచి పుట్టి లార్వా దశలో కొన్ని వారాల పాటు నీటిలో బ్రతుకుతాయి.వీటికి రెక్కలు వచ్చి “MAY FLY” గా మారిన తర్వాత కేవలం ఒక రోజు మాత్రమే బ్రతుకుతుంది. ఆ ఒక రోజులోనే ఇది మగ MAY FLY లతో జత కలిసి, తర్వాతి తరం కోసం వేల కొద్ది గ్రుడ్లు పెట్టి చనిపోతాయి.ఆ ఒక రోజులో ఇవి తినడానికి వీటికి నోరు, జీర్ణ వ్యవస్థ ఉండదు. ప్రకృతి ఆహార గొలుసులో “MAY FLY” ఎన్నో జీవులకు ఆహారం.
మనకు మామూలుగా భూమి పైనే ఎక్కువ వాటర్ ఉంది అని మనకు తెలుసు కానీ భూమి కింద కూడా వాటర్ ఉందని మీకు telas భూమికింద ఉన్న వాటర్ భూమి పై ఉన్న వాటర్ కన్నా 4 రెట్లు ఎక్కువ nuethern యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం భూమికి 700 కిమీటర్ల కిందా gigantic water ఉందట.
మనం రేగులగా money transaction కోసం వాడే qr code ను మొదట ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఎంతో తెలుసా ? మొదట ఈ QR కోడ్ ను టయోటా కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కంపెనీ తమ యొక్క కారు యొక్క స్పేర్ పార్ట్ ను కనుగొనడానికి ఈ కోడ్ ను తీసుకు వచ్చింది.అక్కడినుండి phones మరియు ఇతర బిజినెస్ ప్రొఫెషనల్ అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
వాతావరణ మార్పుల వల్ల ఒక దేశం పూర్తిగా కాలి చెయ్యవలసి వస్తుంది.తువాలు ఓ చిన్న దేశం. ఆస్ట్రేలియా, హవాయ్ దేశాల మధ్యన ఉండే తువాలు వాస్తవంగా తొమ్మిది దీవుల సమూహం. ఈ దీవుల సమూహంలో మొత్తం జనాభా పన్నెండు వేలకు మించదు. తువాలు ఐలాండ్ చుట్టూ సముద్రాలే. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇటీవల వాతావరణంపై పడింది. దీంతో తువాలు దీవి చుట్టూ సముద్ర మట్టాలు పెరగడం ప్రారంభమైంది. కొంతకాలం నుంచి ఇది ప్రారంభమైంది. ఐలాండ్ కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడం మొదలైంది. దీంతో ఈ ద్వీప దేశానికి పెను ప్రమాదమే వచ్చి పడింది. మరికొన్ని దశాబ్దాల్లో తువాలు ద్వీపం పూర్తిగా కనుమరుగు కానుంది.వాతావరణ మార్పుల వల్ల, తుపాను ద్వీపం పూర్తిగా సముద్ర జలాల్లో కలిసిపోనుంది. తుపానుల ఉధృతి కారణంగా… సముద్ర మట్టం పెరుగుతోంది. ఫలితంగా అలల తాకిడికి నేల కోసుకుపోతోంది. తాగునీటి వనరులు…ఉప్పు నీటిలో కలసిపోతున్నాయి. వ్యవసాయం, జీవనోపాధులు మెల్లిమెల్లిగా దెబ్బతింటున్నాయి. అంతిమంగా ఈ అన్ని కారణాలు…తువాలు దేశాన్ని నివాసానికి పనికి రాకుండా చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో చెప్పడానికి తువాలు ఒక ఉదాహంణ