The mind of the first chinukula and the mapula 2025
తోలి చినుకుల మరి మాపుల మనసు గుస గుస
గతమన్నది మరిచి కొత్త సేయాలో పలక దారులు
మట్టి వాసనే మదిని మైమరిచి ముద్దా గయ్యే
తుండు గుడ్డ తలకాయ రుమాలు తాకేనేలా నీ స్వేద తడిని
నీ చెమట చుక్కలు తాకనిదే పుడమి
ఐన అయ్యేనా ఓ బంగారు నిధి
ఆరుగాలం కంటి పాపను నిదుర పుచ్చకా
వానకొంగి వరద లో పడి
అలసలటొచ్చే దారి నైన అధిగమించి
నమ్ముకున్న ధరణి నోదాలక నష్టమొస్తే
నొచ్చుకున్న నడుస్తావెందుకయ్యా మల్లి ఆ దారినే
గమ్యమంటు ఇవ్వదు నీకు ఈ పాడు లోకం
గాసమన్న గతి లేదు కదా భూ తల్లి గర్భాన్ని చీల్చితే
నీకు లేదు లాభం కానీ రియల్ రంగం లాభాల దారినా
చూసావా ! ఈ విచిత్రం !
అమ్మను అమ్మ అన్నోడికి అన్నమో రామ చంద్రా అనాలి
బిడ్డ అని అంటాది ఈ భూతల్లి
సవతి తల్లి ప్రం చూపిన దొంగా కొడుకుల చేస్తాది బడా బాబుల
నీకు లేదే ఎక్కడ ఓ మూలనైనా గౌరవం
పల్లె నడుమ పండించి పంటను
పట్నమందు మోస పోయే ధరలకమ్మి
కన్నంతా కన్నీరు రాల్చక నా బిడ్డ కడుపు నిండితే
చాలునంటావా నీకన్నా ఉన్నడా ఈ లోకాన పిచ్చివాడు
అదురాగ బాధ బడుతూ కన్నా పేగు నలిగినట్టు
పంట కెమ్మన్నయ్యి తలా వాల్చుకుంటే గుండె ఆగేనా
అందుకేనేమో పంటా కన్నా తల్లి ప్రేమ అంటారు..
నీ బిడ్డనైనా చూసావా అంతలా ఎప్పుడైనా..
నీతో బంధం ఆపాడు ఈ పుడమి ఎప్పటికి
అది ఆపినప్పుడు వచ్చును లోకాన ఆకలి చావులు
ఆ రోజు పెట్టును కంప్యూటరు సాఫ్ట్వేరులు ముద్దగా
నీ కడుపునా ఒక రాచ పండును ఏర్పరచును …
వదలరా ఓ వీరుడా నీకు ఎందుకురా ఈ వ్యయం లేని సహాయం …
నీకు ఎక్కడ రాజా లాంఛన దహన సంస్కారం …
లంగాలకు దొరికెను చూడు తుపాకుల శబ్దాల దహనం …
నీకు చేతను కాదు వదిలేయడం ఈ వ్యవసాయం
నిన్ను పీడించేటోళ్లకు నువ్వే ఆహారం…