The center released funds to Telangana 2026
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం గ్రామా పంచాయతీలకు అవసరమైన నిధులను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం గ్రామా పంచాయతీలకు అవసరమైన నిధులను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి.కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఈ నిదులపైనా ప్రత్యేక చొరవ చూపి కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.నిధులు లేక అభివృద్ధి మరియు కనీస వస్తులకై ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు కొత్త ఊపిరి పోయనున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడం, నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పంచాయతీల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటేనే ఈ నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. పంచాయతీలకు అందిన ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా అవసరాల కోసం రాష్ట్ర సర్కార్ ఖర్చు చేయనుంది..










