TGSRTC recruitment for Drivers and Shramiks
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) డ్రైవర్స్ అండ్ శృంకేర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8, 2025 ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారిక వెబ్సైటు నుండి ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవచ్చు .
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ద్వారా డ్రైవర్స్ మరియు శ్రీకేర్ ఉద్యోగాలకు దారఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 8, 2025 ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారిక వెబ్సైటు నుండి ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి అని తెలిపింది. దానికి సంబంధిచి పూర్తి సమాచారం తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం : అక్టోబర్ 8, 2025 ఉదయం 8.00am
- అప్లికేషన్ చివరి తేదీ : అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5.00pm
అర్హత
- జూలై 1, 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- నోటిఫికేషన్ తేదీ నాటికి అంటే సెప్టెంబర్ 17, 2025 నాటికి కనీసం 18 నెలల పాటు హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV) మరియు హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్‌ను నిరంతరం నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
- డ్రైవర్ వయోపరిమితి: 22- 35 సంవత్సరాలు
- శ్రామిక్‌లకు వయోపరిమితి: 18-30 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్ (రూ.)
- డ్రైవర్లు: రూ. 20,960-60,080
- శ్రామిక్స్: రూ. 16,550-45,030
పోస్ట్ వివరాలు
- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లు 1000
- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో శ్రామిక్‌లు 743