TG New Mee Seva Centers Notification released మీ సేవ సెంటర్ల ఏర్పాటుకు చివరితేది అప్పుడే 2024

Photo of author

By Admin

TG New Mee Seva Centers Notification released మీ సేవ సెంటర్ల ఏర్పాటుకు చివరితేది అప్పుడే

ఈ మీ సేవ కేంద్రాలకు అప్లై చేసుకునే వారు కచ్చితంగా లోకల్ కాండిడేట్ ఐతే మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.జగిత్యాల జిల్లాలో నాలుగు మీ సేవ కేంద్రాలకు నవంబర్ 26 నుండి డిసెంబర్ 04 వరకు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గడువు నిర్ణయంచింది.

TG New Mee Seva Centers Notification released  తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇంటి దగ్గరే మీసేవ నడుపుతూ ఆదాయాన్ని పొందే విధంగా జిల్లాలో మీ నాలుగు మీసేవ కేంద్రలా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నమ్ ఇచ్చింది ఇప్పటికే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకుంటున్నారు.ఈ మీ సేవ కేంద్రాల కోసం అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్హులకు కొన్ని అర్హత ప్రమాణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మీ సేవ కేంద్రాలకు అప్లై చేసుకునే వారు కచ్చితంగా లోకల్ కాండిడేట్ ఐతే మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.జగిత్యాల జిల్లాలో నాలుగు మీ సేవ కేంద్రాలకు నవంబర్ 26 నుండి డిసెంబర్ 04 వరకు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గడువు నిర్ణయంచింది.వాటికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..జగిత్యాల జిల్లాలో కొత్తగా అవకాశం ఇచ్చిన నాలుగు మీ సేవ కేంద్రాలను భీమారం, మోరపల్లి, రంగపేట్, జగ్గాసాగర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది.

ముఖ్యమైన తేదీలు – Impotent Dates :

అప్లికేషన్ ప్రారంభ తేదీ; నవంబర్ 26,2024
అప్లికేషన్ చివరి తేదీ: డిసెంబర్ 04, 2024

అర్హతలు – Eligibility:

దరఖాస్తుదారులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి..

  • అభ్యర్థి నిరుద్యోగిగా ఉండాలి.
  • కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • వయసు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • జగిత్యాల జిల్లా పరిధిలోని అదే మండలానికి చెందినవారు కావాలి

ఫీజ్ – Fee:

అభ్యర్థి పేరుపై రూ.500 యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) జగిత్యాల జిల్లా కలెక్టర్ పేరుతో చెల్లించాలి.

అప్లై చేసుకోవడానికి కావలసిన డాకుమెంట్స్ Documents:

  • అకాడమిక్ సర్టిఫికెట్లు
  • కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు
  • పదవ తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్,
  • నివాస ధృవీకరణ పత్ర
  • కుల ధృవీకరణ పత్రం
  • దరఖాస్తు పత్రాలకు గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్ తప్పనిసరి.

.
ఎంపిక విధానం – Selection Process

  1. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  2. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు మాత్రమే పరీక్షకు అర్హులవుతారు.
  3. ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలంగాణ స్టేట్ మీసేవా సేవలపై ప్రశ్నలు ఉంటాయి.

ఎంపికైన అభ్యర్థులు మీ సేవా కేంద్రం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. కేంద్రం ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే ప్రారంభించాలి.

అప్లికేషన్ విధానం – Application Process:

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను జగిత్యాల జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://www.jagtial.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫారమ్ నింపిన తర్వాత సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి.

ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఒక చక్కని అవకాశంగా నిలుస్తుంది. మీ సేవా కేంద్రాలు స్థానిక గ్రామాలకు సేవలందిస్తూ, యువత ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి తోడ్పడతాయి.

Note: పై న తెలుపబడిన అప్లికేషన్స్ కు అప్లై చేసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్న తరువాతే అప్లై చేసుకోగలరు. 

Leave a Comment