Telugu girl excels in DISA results
విజయనగరం/ MRR NEWS: ఐసీఏఐ తాజాగా విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అసెస్మెంట్ టెస్ట్ ఫలితాల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటింది. ఆల్–ఇండియా ఫస్ట్ ర్యాంక్‌ను విజయనగరం జిల్లాకు చెందిన అన్నే వెంకట రమ్య దక్కించుకుంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ రంగంలో పనిచేయాలనుకునే వారికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ టెస్ట్ ఇది.
విజయనగరం జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రముఖ చార్టడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ తన స్కిల్, పనితనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్య.. ఈసారి జాతీయ స్థాయి పరీక్షలో అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ రంగంలో ఛాలెంజస్ అధిగమిస్తూ, ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంపొందించుకుంటూ వచ్చిన రమ్య సాధించిన ఈ విజయంపై జిల్లాలోని ఆడిటర్లు, సహచరులు, సీనియర్ ప్రొఫెషనల్స్ ఆమెను అభినందిస్తున్నారు.రమ్య సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్‌తో విజయనగరం జిల్లా మరోసారి ప్రతిభకు నిలయమని రుజువైంది. ICAI నిర్వహించే అన్ని పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి పరీక్షలో ఈ ఫలితం రమ్య కృషి, పట్టుదల, ప్రొఫెషనల్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.










