Telangana Rythu Bharosa Guidelines released : పలు సంస్థల ద్వారా శాటిలైట్ సర్వేలు 2025

Photo of author

By Admin

Telangana Rythu Bharosa Guidelines released: పలు సంస్థల ద్వారా శాటిలైట్ సర్వేలు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందించబోతున్న రైతు భరోసా నిధులుకురెవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది త్వరలోనే తేల్చి గ్రామపంచాయతీలో స్టిక్ చేస్తామని తుమ్మల నాగేశ్వర రావు తెలపడం జరిగింది.

ఎలక్షన్ హామీల్లో ఆరు గ్యారెంటీలో భాగంగా ఒక గ్యారెంటీ ఆయన తెలంగాణ రైతు భరోసా నిధులను జనవరి 26 నా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే పలు సంస్థల ద్వారా శాటిలైట్ సర్వేలు అయితే నిర్వహిస్తోంది. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రైతు భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుపడం జరిగింది. రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ భూములు, ఇంతకుముందే ప్రాజెక్టుల కోసం రోడ్ల నిర్మాణం కోసం భవన నిర్మాణాల కోసం ప్రాజెక్టు నిర్మాణాల కోసం రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం భూములు సేకరిస్తే వాటికి కూడా రైతు భరోసా నిధులను కేటాయించమని సీఎం తెలిపారు.

భూముల వివరాలను, గ్రామాల వారిగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది..డిటైల్స్‌ను పంచాయతీ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. రైతు భరోసా స్కీం కింద రైతులకు ఎకరాకో 12 వేల రూపాయలు రైతుల ఖాతాలో జనవరి 25 తారీకు నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే దీనికోసం అని అర్హత ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది దీని కోసమని రెవిన్యూ అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నారు.రైతులకు నగదు బదిలీ చేసే ముందు సాగుకు యోగ్యత లేని భూముల వివరాలను బహిరంగ పరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ జాబితాలో కొండలు, గుట్టలు, వెంచర్లు, మైనింగ్ గనులు, రోడ్లు, ప్రభుత్వం వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

అలాంటి భూముల వివరాలను గ్రామాల వారిగా, స్థానిక పంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదని, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే చక్కదిద్దే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ‘ఈ నెల 20 తరువాత గ్రామాల వారిగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను పంచాయతీ ఆఫీసుల్లో డిస్ ప్లే చేయాలని అనుకుంటున్నాం. దీంతో భూములు వివరాలు అందరికీ తెలుస్తాయి’ అని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్స్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలను సేకరిస్తున్నారు.

సాగుకు యోగ్యం లేని భూమలు వివరాలను ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో రెండు శాఖల ఆఫీసర్లు ఇదే పనిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో సాగుకు ఉపయోగం లేని భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయోనని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. అయితే.. సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను సేకరించే సమయంలో శాటిలైట్ డేటాతో సరిపోల్చనున్నారు. సాగవుతున్న భూములేంటి..? ఆ భూముల సర్వే నంబర్లు ఏంటి..? అందులో కొండలు, గుట్టలు, రోడ్లు, డావు భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈ వివరాలను హైదరాబాద్ శివారులోని ఇక్రిశాట్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యం లేని భూములు దాదాపు 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది. అందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు సమాచారం. అందులోనూ మెజార్టీ భూములు వెంచర్లు, రోడ్ల కింద సేకరించినవి, అవుటర్ నిర్మాణం కోసం తీసుకున్నవి, ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించినవి ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో గుట్టలు, రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్, సాగు యోగ్యం లేని వాటికి, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు సైతం రైతుబంధు అందించారు. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా విధానానికి తెరతీసింది.

Leave a Comment