Telangana Rythu Bharosa: రైతూ భరోసా పై మళ్ళి కోత విధించిన ప్రభుత్వం

Photo of author

By Admin

Table of Contents

Telangana Rythu Bharosa: రైతూ భరోసా పై మళ్ళి కోత విధించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 15000 రూపాయల భరోసపై మళ్ళీ కొత్త విధించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలక్షన్ హామిలైన ఆర్జ్ గ్యరెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాయి.మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,500 లకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలను అమలు చేస్తూనే వస్తుంది.ఆరు గారెంటీల హామీల్లో ముఖ్య భీమిక అయిన రైతు రుణమాఫి మరియు రైతు భరోసా వీటి గురించి ఇప్పుడు మాట్లాడుదాం.

రైతు రుణమాఫీ 

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీని మూడు దశల్లో ఐతే అమలు చేస్తాం.ఆగస్టు 15లోగా ఈ మాఫీ ప్రక్రియను అమలు చేసి తీరుతాం అని ప్రకటించింది.ప్రకటించిన విధంగానే రైతులకు ప్రభుత్వం మాఫీ చేసింది.మాఫీ కోసం 31 వేల కొట్లుగా బడ్జెట్ ను నిర్ణయించింది.కానీ 19 వేల కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ను విడుదల చేసింది.

మొదటి దశ మాఫీ 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాన్ని 11.50 లక్షల మంది రైతు కుటుంబాలకు మాఫీ చేసింది.రెండవ దశ మాఫీ భాగంగా లక్ష నుండి లక్ష యాభై వేల వరకు రుణాన్ని బ్యాంకుల ద్వారా తీసుకున్న రైతులు ఉన్నారో వారికి 6 లక్షల మంది రైతులకు రుణాన్ని మాఫీ చేసింది.ఇంకా మూడో దశ రుణమాఫీలో లక్ష యాభై వేల నుండి రెండు లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది.

కానీ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల 10 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు.దీంతో రైతులు ఆందోళనలు చేపట్టగా వారి కోసం ప్రత్యేకమైన ఆప్ డిసైన్ చేసి ఏ రైతులకు మాఫీ కాలేదో వారి డేటాను స్వీకరించి సెప్టెంబరు నెల ఆఖరులోగా మాఫీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రైతు భరోసా

రైతులకు పెట్టుబడి సహాయంగా అందించే 15000 రూపాయలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విధి విధానాలను తయారు చేయకపోవడం గమనార్హం. అంతే కాకుండా రైతులు ఎవరైతే తమ అభూమిని సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని సాగు చేయని భూములకు రైతు భరోసా కింద 15,000 రూపాయలను ఇవ్వబోమని తెలిపారు.గతంలో వారి వేసినందుకు గాను ఎకరాకు 500 రూపాయలను బోనస్ గా ఇస్తానన్న ప్రభుత్వం దాన్ని ఇప్పుడు ఎవరైతే తాము ఎంపిక చేసిన వడ్లను సన్న బియ్యం పండిస్తున్నారో వారికి మాత్రమే పంట కొనే సమయంలో 500 రూపాయలను బోనస్ గా అందిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో తెలుపడం జరిగింది.

ఇప్పుడు రైతు భరోసాను సంభందించి ఇంకా నియమ నిభందనలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయని చేయలేదు.కానీ పంటను సాగు చేస్తున్న వారికి మాత్రమే రైతు భరోసా అందిస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం తెలుపడం పై ప్రతిపక్షాలు నవ్వుకుంటున్నాయి .

ఈ ఏడాది రైతు భీమా మొత్తం ప్రీమియం ను ప్రభుత్వమే భరిస్తుంది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పై మాట్లాడుతూ 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే భరోసా ఇస్తాం అన్నారు.

 

Leave a Comment