Telangana New Ration Cards List Updating issue: కొత్త రేషన్ కార్డులకు మల్లి కొత్త తంటా
గ్రామంలోనే ఉన్న వారి పేర్లు లేవు కానీ బ్రతుకుదెరువుకోసం పట్నాలకి దేశాలకు వెళ్లిన వారి పేర్లు ఎందు వచ్చాయి అని ఆందోళన చేపట్టారు. వాటిని మార్చి మా పేర్లు జాబితాలో ఉంచకపోతే సర్వే కూడా జగనీయం అని రైతులు తో పాటు అర్హులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అమలు చేయడం కోసం సర్వే అయితే నిర్వహించింది ఈ సర్వే లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో 11.65 లక్షల మంది పేర్లు ఉన్నాయి. ఈ నెల 20-24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు పెట్టి అభ్యంతరాలు సేకరించిన తర్వాత తుది జాబితా ఖరారు చేస్తారు. ఇలా కలెక్టర్ల ద్వారా వచ్చే లిస్టులతో జనవరి 26 నుంచి కార్డులు మంజూరు చేస్తారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండనున్నాయి.
అయితే ఇప్పటికే గ్రామాల్లో విడుదల చేసిన కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాపై పలు గ్రామాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామంలోనే ఉన్న వారి పేర్లు లేవు కానీ బ్రతుకుదెరువుకోసం పట్నాలకి దేశాలకు వెళ్లిన వారి పేర్లు ఎందు వచ్చాయి అని ఆందోళన చేపట్టారు. వాటిని మార్చి మా పేర్లు జాబితాలో ఉంచకపోతే సర్వే కూడా జగనీయం అని రైతులు తో పాటు అర్హులు ఆందోళన చేపట్టారు. కులగనున్న ఆధారంగా రేషన్ కార్డులను ఇవ్వబోతున్నామని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలపడం జరిగింది. గతంలో ఉన్న రూల్స్ ప్రకారం కొత్త రేషన్ కార్డులను అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎటు కాకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా అర్హుల జాబితాను తయారు చేస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు విమర్శలకు దిగుతున్నారు.
ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు 9 సంవత్సరాల నుంచి లేక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డులో జాబితాను గుర్తించి వారి ఇబ్బందులను తీరుస్తుంది అని అనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం గందరకోలానికి తరచూ ఇస్తుంది అని నిపుణులు చెబుతున్నారు ఇది ప్రభుత్వ అధికారుల తప్పిదమా లేదా ప్రభుత్వం తప్పిదమా అని పలువురు అంటున్నారు.