Telangana Local Body Elections GO Released
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతం పరిమితిలో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ కేటాయింపు పద్ధతులు, రొటేషన్ విధానం, అధికారుల బాధ్యతలు వంటి కీలక అంశాలను స్పష్టంగా పేర్కొంటూ జీవో 46ను శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ జీవోతో గ్రామీణ ప్రాంతాల్లో రాబోయే ఎన్నికల పై స్పష్టత రావడంతో స్థానిక నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో అదే రోజున విచారణ జరపనుంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.ఈ నెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో డిసెంబర్ 16 వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.రాష్ట్రంలో 545 మండలాలు, 12,760 గ్రామాలు., 1,13,534 వార్డులు ఉన్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. వార్డు సభ్యులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 ఆధారంగా రిజర్వేషన్లు కల్పించనున్నారు. కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018ని సవరించినందున ఆ చట్టం ప్రకారం జరిగే సాధారణ ఎన్నికల నుండి భ్రమణ ప్రాతిపదికన జరుగుతాయి. తదుపరి ఎన్నికలను (ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు) రెండవ సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. గత పంచాయితీ ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించారో , వాటిని పరిగణనలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది.










Normally I do not read article on blogs however I would like to say that this writeup very forced me to try and do so Your writing style has been amazed me Thanks quite great post