Telangana High court seeks clarity on pharma
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనన్ను రద్దు చేసింది. కాగా భూసేకరణను వ్యతిరేకిస్తూ, ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన పిటిషన్లపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణ సమయంలో ఆందోళనలు జరిగి పలువురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే..
వికారాబాద్ జిల్లాలో హకీమ్పేట పరిధిలోని నేల తల్లిని నమ్ముకొని పల్లె ఒడిలో నివసిస్తున్న గిరిజనుల భూ ములను ఫార్మా కంపెనీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు యత్నించిన విష యం విదితమే.తాము ఓటేసి గెలిపిస్తే ముఖ్యమం త్రి అయిన రేవంత్‌రెడ్డి.. తమ బతుకులను ఆగం చేస్తున్నాడని ఆగ్రహించిన లగచర్ల తదితర ఐదు గ్రామాల గిరిజన రైతులు ఎదురు తిరిగినందుకు అర్ధరాత్రి సమయంలో తండాలో పోలీసులు సాగించిన దమనకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ కేసులతో గిరిజనులను నానా ఇక్కట్లు పెట్టిన విషయంలోనూ ప్రభుత్వం అప్రతిష్ట పాలైం ది.హకీంపేట్ పులిచర్లకుంట తండాల పరిధిలో Multipurpose Industrial Park 1,177 భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది.
అందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉంది. అయితే, భూ నిర్వాసితులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వికారాబాద్ కలెక్టర్ గ్రామా ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో వారంతా భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల, పులిచర్లకుంట తండాలో ఇప్పటికే సర్వే కాగా.. పోలేపల్లి రైతులకు నష్ట పరిహారం అందించారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు అధికారులను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే.ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన పిటిషన్లపై పలువురు కోర్టును ఆశ్రయించారు. లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనన్ను రద్దు చేస్తూ హై కోర్ట్ తీర్పు ఇచ్చింది దీంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు.