Telangana Govt Releasing Endoment Found 6000
దేశం లో ఉన్న ఆలయాలను శిథిలావస్త నుండి బయటకు తీసుకు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వార ప్రతి ఒక్క ఆలయానికి కొత్త రూపం రానుంది ఆ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత దేశంలో ఉన్న అన్ని దేవాలయాలకు కొత్త రూపం తీసుకు రావడం కోసం కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా దేవాలయాల అన్ని శిథిలావస్థకు వచ్చిన దేవాలయాలు కూడా ఇప్పుడు కొత్తగా మారనున్నాయి…దీంతో ప్రతి ఒక్క ఊరు మరియు ఊరిలో ఉన్న దేవాలయాలు కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి.భారతదేశం ఆధ్యాత్మికతకు, భక్తికి నిలయం. ఎన్నో పురాతన దేవాలయాలు మన సంస్కృతిని, సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే.. కాలక్రమంలో సరైన పోషణ లేక, ఆదాయం లేక అనేక చిన్న దేవాలయాలు వెలుగు కోల్పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఇలాంటి ఆలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాకుండా, ఆయా గ్రామాలకు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతుంటాయి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ధికంగా వెనుకబడిన దేవాలయాలకు చేయూతనిచ్చేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే ‘ధూప దీప నైవేద్య పథకం’.
ఈ పథకం ద్వారా నిధులు సమకూర్చేందుకు అర్హులైన ఆలయాల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికైన దేవాలయాలకు నెలకు రూ.4,000 ఆర్థిక సహాయం. అలాగే ఆ ఆలయ అర్చకులకు నెలకు రూ.6,000 వేతనం దేవాదాయ శాఖ ద్వారా నేరుగా చెల్లించబడుతుంది.రాష్ట్రంలోని అనేక చిన్న దేవాలయాలు సరైన ఆదాయం లేక పూజలు నిర్వహించడానికి, అర్చకులకు వేతనాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ దూపదీప నైవేద్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన దేవాలయాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా ఆయా గ్రామాల్లో దేవాలయాల నిర్వహణ సక్రమంగా జరిగి.. సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
అంతేకాకుండా.. అర్చకులకు కొంతైనా వేతనం అందుతుండటంతో వారి జీవనోపాధికి కూడా తోడ్పడుతుందిఈ విషయాన్ని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకటరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఆర్థిక సహాయం పొందడానికి అర్హత కలిగిన ఆలయాలు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ఆలయం కనీసం 15 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉండాలని నిబంధన విధించారు.ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు.. ఇది గ్రామీణ సంస్కృతిని, ఆధ్యాత్మికతను పరిరక్షించే ఒక ప్రయత్నం. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగాలంటే దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకున్న ఈ చర్య ఎంతోమందికి ఊరటనిచ్చే విషయం. అర్హులైన దేవాలయాల నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వం కోరుతోంది.