Telangana Govt New Rule For Cotton Purchas
పత్తి పండించే రైతులకు ప్రభుత్వం కొత్త సమాచారాన్ని అందించింది.ఈ సమాచారము ప్రకారం పతికి కొనుగోలు కేంద్రాలను ఆలౌట్ చేయనున్నారు.
రైతులు గతంలో పత్తి అమ్మాలంటే దగరలో ఉన్న మార్కెట్ కు వెళ్లి అమ్ముకునే వారు కానీ ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త విధానం ద్వారా రైతులు ఇక్కట్లు పడే ప్రమాదం కనిపిస్తుంది.పత్తిని పండించిన రైతులను ప్రభుత్వం స్లాట్ బుక్ చేసుకోవాలి అని చెబుతుంది.స్లాట్ బుకింగ్ విధానం కోసం కొత్తగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కప్పస్ కిసాన్ అనే అప్ ను ప్రవేశ పెట్టింది.ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చింది.
రైతు తన పత్తి పంటను విక్రయించాలంటే ఈ యాప్లో వారం రోజుల ముందే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సీసీఐ అధి కారులు తెలిపారు. స్లాట్లో నిర్దేశించిన సమయానికి రైతులు పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త విధానానికి రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది రైతులు ఇప్పటికీ నిరక్షరాస్యులే.
అలాంటివారికి యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఇబ్బందే. స్మార్ట్ఫోన్లు అందరికీ ఉండవు. పైగా వారం రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన మరింత ఇక్కట్లకు గురి చేయనుంది. స్లాట్లో నిర్దేశించిన రోజు ఏ కారణం చేత పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్ళకపోయినా స్లాట్ రద్దవుతుంది. కాబట్టి మళ్ళీ వారం రోజుల తర్వాత మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పంట అమ్ముకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది.
సాధారణంగా రైతులు తమ సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకుంటారు. ఈ స్లాట్ విధానంతో దూరప్రాంతాల్లోని కేంద్రాలకు కూడా స్ప్లాట్ కేటాయించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. దీంతో రైతులకు దూరం పెరిగి రవాణా ఖర్చులు కూడా భారంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈసారి 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది.
గతేడాది సుమారు 210.19 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.దీని ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకొని తమ పత్తి పంటను అమ్ముకోవాలి అని చెబుతుంది.పత్తిని అమ్ముకోవాలి అని అనుకునే రైతులు ఈ అప్ ద్వారా వారం రోజుల ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి అని తెలిపింది.
స్లాట్ బుక్ చేసుకుంటేనే రైతుల దగ్గర నుండి కొనునుగోలు చేసుకుంటారు అని తెలిపింది .దీంతో రైతులు ఎక్కడిక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు.ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త విధానం ద్వారా రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోనున్నారు.