Telangana Govt Giving Advance for Singareni
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది..ఈ న్యూస్ ద్వారా కార్మికులు అతి పెద్ద పండుగ ఐన బతుకమ్మ దసరా దీపావళి ఒకేసారి జరుపుకోనున్నారు.
తెలంగాణ లో అతి పెద్ద పండుగా ఏది అంటే ఎవరైనా చెప్పేది బతుకమ్మ మరియు దసరా ఈ రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అనేది అంధ జేస్తుంది.ఇప్పుడు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు సింగరేణి కార్మికులను కలిసి వారితో చర్చలు జరిపారు.సింగరేణి కార్మికులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రోజున సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఈ పండగ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి రూ. 25 వేల చొప్పున దసరా అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో తాత్కాలిక కార్మికులకు రూ. 12,500 చొప్పున ఇవ్వనున్నట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఈ మొత్తం డబ్బులను ఈ నెల 23వ తేదీన జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.సింగరేణి లాభాల వాటాను 35 శాతం చెల్లించాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం.