రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం 50% సబ్సిడీ | Telangana Farm Mechanization Scheme 2025

Telangana Farm Mechanization Scheme 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది పథకం ద్వారా రైతులు తమకి కావలసిన వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ కింద పొందవచ్చు.దీంతో రైతులకి ఎంతో కొంత ఆర్ధికంగా మేలు చేయనుంది రేవంత్ సర్కార్.

రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తేవడమే కాకుండా వాటిని అమలు చేస్తూ ఉంది కూడా అయితే ఇప్పుడు కొత్తగా రైతుల కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యాంత్రీకరణ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు సబ్సిడీ కింద వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను పొందవచ్చు . గత ప్రభుత్వం ఈ పథకాన్ని తొక్కి పట్టి ఉంచగా ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు 40 నుంచి 50% వరకు సబ్సిడీని అయితే పొందవచ్చు.5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతు పథకానికి అప్లై చేసుకోవచ్చు. పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 బడ్జెట్లో 101 కోట్ల రూపాయలను విడుదల చేసింది.2 నెలల క్రితం అప్లికేషన్ చేసుకున్న 1.30 లక్షల మంది రైతులకు అప్ప్రోవల్స్ ఇచ్చింది.

అర్హత

  • పథకం కింద అప్లై చేసుకోవాలి అనుకునే రైతులు 5 ఎకరాల లోపు భూమి ఉండాలి.
  • రాష్ట్ర నివాసి అయ్యి ఉండాలి.

సబ్సిడీ

  • SC /ST / మహిళా రైతులకు పథకం కింద 50% సబ్సిడీ అనేది అందుతుంది.
  • ఇతర రైతులకు 40% సబ్సిడీ అందుతుంది.
  • పథకం కింద మహిళా సంఘాల వారికి అవకాశం కల్పించింది.

అప్లై చేసుకోవడం ఎలా

  • పథకానికి అప్లై చేసుకోవాలి అని అనుకునే రైతులు తమ వ్యవసాయ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి.
  • అప్లై చేఉకున్న తరువాత అర్హత గల రైతులను ఏవో ఎంపిక చేయడం జరుగుతుంది.
  • AO ఎంపిక చేసిన 10 రోజుల లోపు సంబంధిత కంపెనీలు రైతుల ఇంటికి పనిముట్లను డెలివరీ చేస్తారు.

Leave a Comment