TDP Leaders Attack on Janasena Leaders
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జిల్లా పరిషత్ కాంప్లెక్స్ లో షాపు నడుపుకుంటున్న జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు దాడి.
రైతు ప్రస్థానం: ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వాల మధ్య విద్వేషాలు చెలరేగుతున్నాయి అనడానికి కారణాలు లేకపోలేదు .ఎప్పటికప్పుడు జన సేన కార్యకర్తలపైనా టీడీపీ నాయకులూ పలు రకాలుగా చిన్న చూపు చూసి దాడులకు పాల్పడుతున్నారు.ఇప్పుడు ఆంధ్రలో పలు జిల్లాల్లో పార్టీల మధ్య విబేధాలు చెలరేగుతున్నాయి ఇటీవల పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జిల్లా పరిషత్ కాంప్లెక్స్ లో షాపు నడుపుకుంటున్న జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు దాడి..రూ.3వేలు అద్దె చెల్లిస్తున్న షాపుకు రూ.30వేలు చెల్లించాలన్న టీడీపీ నాయకులు. అడ్డం తిరిగిన సాంబశివరావుపై దాడి చేసి షాపులోని సామాన్లు బయట పడేసిన వైనం. అయితే “ఎమ్మెల్యే చెబితేనే చేశామని” బహిరంగంగా చెబుతున్న టీడీపీ నేతలు. టీడీపీ వాళ్లు జనసేన వాళ్లను మొదటి నుంచి చులకనగా చూస్తున్నారని, టీడీపీ వాళ్ల వెంట తిరగడానికి జనసేన నాయకులకు సిగ్గుండాలని కారెడ్ల రమణ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here










