State government issuing soil health cards
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం భూసార పరీక్షల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీని మొదలు పెట్టింది. భూములకు జరిపే భూసార పరీక్షలు రైతుల యొక్క పంట దిగుబడిని పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది .ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఏపీలోని రైతుల సంక్షేమానికి కూడా కృషి చేస్తోంది. రైతులకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకంతో పంట పెట్టుబడులకు ఆర్ధిక సహాయం అందించిన ఏపీ సర్కార్, తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఏపీలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తోంది. రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం భూసార పరీక్షల ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీని మొదలు పెట్టింది. భూములకు జరిపే భూసార పరీక్షలు రైతుల యొక్క పంట దిగుబడిని పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులకు ఈ కార్డులను అందించనుంది.సాయిల్ హెల్త్ కార్డులతో లాభాలు ఈ సాయిల్ హెల్త్ కార్డులను అందించడం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం0.
- దీనిని ఏపీలో 100% అమలుపరచడానికి ఏపీ సర్కార్ పనిచేస్తోంది.
- మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య పరీక్షలు ఎంత అవసరమో, భూమి ఆరోగ్యంగా ఉండాలి అంటే భూసార పరీక్షలు అంతే ముఖ్యం.
- ఈ పరీక్షల ద్వారా భూమిలో ఉన్న సారాన్ని, పోషకాల స్థాయిలను, లోపాలను తెలుసుకుంటారు.
- సాయిల్ హెల్త్ కార్డులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖాధికారులు ఇస్తారు.
- పంటల నాణ్యత, దిగుబడిని పెంచడం కోసం ఏం చేయాలి అన్న దానిపైన భూసార పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి.
- గత ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షల పైన అనేక విమర్శలు వచ్చాయి.
- ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గతంలో సేకరించిన నమూనాలను సైతం పరీక్షించి వాటి ఆధారంగా భూ ఆరోగ్య కార్డులను జారీ చేయడం మొదలుపెట్టింది.
రాష్ట్రంలోని ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డు 2025 2026 సంవత్సరానికి సంబంధించి ఈ సాయిల్ హెల్త్ కార్డులను రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇవ్వడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. ఈ సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా రైతులు తమ భూమి స్వభావాన్ని అర్థం చేసుకుని దానికనుగుణంగా సరైన పంటలు, సరైన సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో దిగుబడి గణనీయంగా ఉంటుంది. ఇది రైతుల ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here










