Southwest monsoon winds coming early this time
మే 27వ తేదీకే నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే ఐదు రోజులు ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్నాయి. నిజంనికి జూన్ 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ముందు అంచనా వేశారు.కానీ రుతుపవనాల పురోగతిలో వేగంగా ఉండటంతో ముందేగానే వస్తున్నాయని IMD ప్రకటించింది. ముందుగానే రుతుపవనాలు వస్తున్నాయంటే వ్యవసాయ రంగానికి మంచి వార్తగా చెబుతున్నారు. ముందుగానే రుతుపవనాలు రావడంతో వర్షాలు సమృద్ధిగా పడతాయి. ఈ ఏడాది వర్షపాతం కూడా సాధారణంగా ఉంటుందని చెప్పడంతో రైతాంగం సంతోషంలో మునిగి తేలుతోంది. రుతుపవనాలు సమీపించడానికి ముందే కేరళలో భారీ వర్షాలు పడనుండటంతో అధికార యంత్రాంగం ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది . ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కూడా ముందుగానే రుతురాగం వినిపించనుంది.
మరోవైపు తమిళనాడు సైతం ఈ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో కీలకమైన మెట్టూరు డ్యామ్ నుంచి నీటిని జూన్ 12న వదిలేందుకు కూడా సమాయత్తమైంది. వర్షాల రాక నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం (మే 19, 2025) సమీక్షా సమావేశం నిర్వహించారు. కోయంబత్తూర్, థేని, దుండిగల్,తిరుప్పూర్, ఈరోడ్, కృష్ణగిరి, నీలగిరి, ధర్మపురి ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.