Sky root Aerospace Company has an agreement: తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం 2025

Photo of author

By Admin

Sky root Aerospace Company has an agreement: తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం 2025

ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్‌ (Skyroot Aerospace) కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశారు.

ఒప్పందం ప్రకారం స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందం పట్ల ముఖ్యమంత్రి గారు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక అంతరిక్ష రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు.

స్కైరూట్‌ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందని శ్రీ శ్రీధర్ బాబు గారు అన్నారు. త్వరలోనే హైదరాబాద్‌ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కై రూట్ కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన గారు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామని చెప్పారు.

FAQ

Leave a Comment