sadabainama Lands Regularisation issue
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా భూ తగాదాలు రానున్నాయట ఇప్పుడే తెలుసుకుందాం రండి
సాదాబైనామాలకు ఇటీవలే జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంతలోనే కొత్త తలనొప్పి రైతులకు అందించనుంది.ccla విడుదల చేసిన ఆనిబంధనల వలన రైతులు అధిక మొత్తంలో డబ్బు నష్ట పోనున్నారు.కోర్ట్ కేసుల నుండి బయటకు తీసుకు వచ్చిన 9 లక్షల సాదాబైనామా దారఖాస్తులు క్రమబద్దీకరణ చేయడం కోసం ccla నిబంధనలను విడుదల చేసింది.దీని ద్వారా రైతులు ప్రమాదంలో పడనున్నారు.ఆ మూడు నిబంధనలో మొదటిది రైతులు ఎవరైతే సాదాబైనామాల కింద భూములు కొనుగోలు చేశారో వారు అమ్మిన వారి దగ్గర నుండి అఫిడవిట్ తీసుకోని రావాలని తేల్చింది.రెండవది 12 సంవత్సరాలుగా సాగులో తామే ఉన్నట్టు దరఖాస్తుదారు రుజువు చేసుకోవడం. మూడోది.. క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్న స్టాంప్ట్యూటీకి అదనంగా రూ. 100 అపరాధ రుసుము చెల్లించాలనడం. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారుల్లో అఫిడవిట్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
సాదాబైనామాకు చట్టపరమైన రక్షణ లేదని, దానిపై ఆధారపడిన రైతులను అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాదాబైనామా ఒప్పందాలన్నీ పాతవి అయినందున.. అమ్మకందారు మరణించినా, లేదా వారసులు ఎవరనే దానిపై వివాదాలున్నా అఫిడవిట్ సేకరించడం చాలా కష్టమవుతుందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు వెళ్లి అఫిడవిట్ అడిగితే ఎవరూ అంగీకరించరని, సానుకూలత తక్కువగా ఉంటుందని రెవెన్యూ అధికారులు కూడా చెబుతున్నారు.
అఫిడవిట్‌ను తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు దరఖాస్తుదారుల నుంచి అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాం కొనుగోలుదారు తాను డబ్బు చెల్లించానని చెప్పి అమ్మకందారు తనకు మొత్తం డబ్బు ముట్టలేదని, ఇంకా బకాయి ఉందని, అఫిడవిట్ ఇవ్వలేనని అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు కూడా సాదాబైనామా రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఫిడవిట్ తీసుకురావడం కష్టమవుతుందని అంటున్నారు.