Rythu Bharosa Scheme Fund Releasing today
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఈ నెల 23 నుండి రైతు భరోసా అమలు చేయాలనీ ఆదేశాలను జారీ చేసింది.
రైతు ప్రస్థానం డెస్క్ : చిన్న సన్న కారు రైతులకు ఇప్పటికే రైతు భరోసా 12 వేళా రూపాయలను మొదటి విడుతని ఇప్పటికే రైతుల కాతాలో రేవంత్ సర్కార్ విడుదల చేసింది.ఐతే ఇప్పుడు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ తర్వాత నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరాకు రూ.6 వేల పెట్టుబడి సాయం అందుతుంది. ఈసారి అన్ని స్థాయిల రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.