REVENUE Act 2024: కొత్త రెవిన్యూ చట్టం ద్వారా సాదాబైనామా

Photo of author

By Admin

REVENUE Act 2024: కొత్త రెవిన్యూ చట్టం ద్వారా సాదాబైనామా

తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం కొత్త రెవిన్యూ చట్టాన్ని అమ్మలు చేయబోతోంది దీని ద్వారా స్వల్ప మార్పులు చేర్పులు చేసి సాదా బైనామాని అందుబాటులోకి తేవాలని రాష్త్ర ప్రభుత్వం లో చీస్తోంది.

 

REVENUE Act 2024:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టం అమలు చేయడం కోసం విధి విధానాలను తయారు చేసే పనిలో నిమగనమైంది.దీనికి సంబంధించి ఇప్పటికే విధానాలు తయారు చేసినట్టు సిక్కుల ప్రతినిధి నవీన్ మిట్టల్ తెలియజేసారు ఈ చట్టం అమలు కోసం రైతుల దగ్గర నుండి అ

REVENUE Act 2024: కొత్త రెవిన్యూ చట్టం ద్వారా సాదాబైనామా
REVENUE Act 2024: కొత్త రెవిన్యూ చట్టం ద్వారా సాదాబైనామా

భిప్రాయ శేఖరం తీసుకున్న తరువాత అమలు లోకి తీసుకొస్తాం అని తెలియజేసారు. రైతుల దగ్గర నుండి అభిప్రాయం సేకరణ తరువాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటెయ్ వాటిని సరి చేసి బిల్లు ఆమోదం జరిగాక ప్రవేశ పెడతామా అని తెలియజేడం జరిగింది. దీనికి సంబంధించి రైతు వేదికల ద్వారా అభిప్రాయం సేకరణ చేస్తాం అని తెలియజేసారు.

సాదాబైనామా

  • గత BRS ప్రభత్వం 2020 వ సంవత్సరంలో రెవిన్యూ చట్టాన్ని కుదించి కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది.అమలులోకి తెచ్చిన కొద్దీ రోజుల్లోనే తెలంగాణ హై కోర్ట్ వివరణ కోరగా ఆ చట్టాన్ని మూలకు పడేసింది.ధరణి వెబ్సైటు అందుబాటులోకి వోచిన కొత్తల్లో భూమి డిజిటలీసాటిన్ పేరుతో సాదాబైనామాలకు సంబంధించిన అప్లికేషన్స్ అన్ని ధరణిలో పోందుపర్చింది.దీనికి సంబంధించి హై కోర్ట్ BRS ప్రభుత్వాన్ని సవరించిన చట్టంలో సాధ బైనామా కు స్థానం లేదని తెలుపడంతో దాదాపుగా 9 లక్షల వరకు అప్లికేషన్స్ ను ప్రభుత్వం విచారించగా పోవడమే కాకుకుండా దానికి సమ్పభంది ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మల్లి రెవిన్యూ చట్టాన్ని సవరిస్తోంది .ఈ సవరణ ద్వారా పెండింగ్ లో ఉన్న ఎన్నో రకాల భూ సమస్యలను మరియు పెండింగ్లో ఉన్న సాదా బైనామా అప్లికేషన్ సమస్యలను పరిష్కరించనుంది.ఇంత వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించని కొన్ని విధానాలను ఐథెయ్ తెలంగాణా ప్రభుత్వం తమ రెవిన్యూ కొత్త చట్టం మార్గదర్శకాల్లో చేర్చింది.
  • ఈ చట్టం అమల్లోకి వస్తేయ్ సాదాబైనామా ద్వారా ఎంతో మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలను అందించనుంది.తరచూ జరిగే భూ వివాదాలకు ఈ చట్టం చెక్ పెట్టనుంది.
  • అంటే భూమి రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ సమయంలో రైతుకు నిర్ధేశించిన గడువులోపు అధికారులు రైతు భూమిని సందర్శిస్తారు.ఒక వేళా అధికారులు నిర్దేశించిన గడువు లోపు రైతు భూమిని సందర్సించక పోతే రైతు తన భూమికి సంబంచిన సైట్ మ్యాప్ ను అధికారులకు మ్యుటేషన్ సమయంలో చూపించవలి ఉంటుంది అంతే కాకుండా అది ఒక ధ్రువపత్రంగా కూడా అధికారులకు ఇవ్వవలసి ఉంటుంది.
  • దీని ద్వారా దాదాపుగా గేట్ల కోసం జరిగే వివాదాలు తగ్గుతాయి అని రాష్ట్రం భావిస్తోంది.
  • ఇంతకు ముందు ఉన్న రెవిన్యూ చట్టంలో సాదాబైనామా ల పరిష్కారం కలెక్టర్ లాగిన్ లో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు తీసుకు రాబోయే చట్టం ద్వారా కలెక్టర్ తో పాటుగా తహశీల్ధార్ కు కూడా సమస్య పరిష్కరించే హక్కులను కొత్త చట్టంలో కల్పించనుంది.గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సమస్యల పరిష్కారాన్ని RDO లకు కల్పించనుంది.

సమస్యల పరిష్కార హక్కులు ఎవరికీ

రివిజన్ మాత్రం రాట్ష్ట్ర ప్రభుత్వం లేదు సీసీఎల్ఏ మాత్రమే చేయాలనీ బిల్లులో పొందుపర్చారు గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలు ఇప్పుడు సీసీఎల్ఏ కు దాఖలు చేసారు.ఏదైనా రికార్డులో తప్పులు జరిగాయి అని భావిస్తే సుమోటోగా తీసుకోని వాటిని పరిష్కరించ వచ్చు.తహసీల్దార్లు ,ఆర్డిఓలు చేసే రిజిస్ట్రేషన్లు ,ముతషన్లకు సంబంధించి వివాదాలు ఒస్తేయ్ ..అప్పీల్ ,రివిజన్కు కొత్త చట్టంలో అవకాశం ఇవ్వనుంది.రిజిస్టర్ దస్తావేజులు ,బాగా పంపకాలు ,వారసత్వ హక్కుల మ్యుటేషన్ ను విచారించే అధికారం తహసీల్ధార్లకు ఉంది.మిగాతా సమస్యలను పరిష్కరించే అధికారం ఆర్డిఓలకు ఇవ్వడం జరిగింది.

ప్రత్యేక గుర్తింపు మరియు ఆబాది

ప్రత్యేక గుర్తింపు: ప్రతి భూ కామతానికి తాత్కాలిక,శాశ్వత భూధార్(ప్రత్యేక గుర్తింపు సంఖ్య ) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్స్ను పరిశీలించి ఈ తాత్కాలిక సంఖ్య అనేది ఇస్తారు.సెర్వే తరువాత శాశ్వత భూధార్ జారీ చేస్తారు.ఈ భూధార్ కు సంబంధించిన మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

ఆబాది:కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూదార్ తోపాటు ఈ ఆబాదీల ఆర్వోఆర్కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో.. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు.

రూపకల్పన కోసం విస్తృత కసరత్తు

“‘రికార్డ్ ఆఫ్ రైట్స్-2024 చట్టం” ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి.. వాటి అమలు వల్ల వచ్చిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి 20 సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు.

ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించడంతోపాటు బిహార్లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశారు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును కల్పంచనున్నారు. ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కాడ నవీన్ మిత్తల్, సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి.

సలహాలు మరియు సూచనలు వీటికి పంపండి

ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. సీసీఎస్ఏ వెబ్సైట్ ( ccla.telan gana.gov.in ) లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతున్నామని.. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in ద్వారా పంపవచ్చని.. లేదా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎస్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్-500001కు పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు.

 

FAQS:

2 thoughts on “REVENUE Act 2024: కొత్త రెవిన్యూ చట్టం ద్వారా సాదాబైనామా”

Leave a Comment