Revanth Reddy campaign bjp wins all the places
తెలంగాణలో బిజెపి పుంజుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తే అక్కడ బిజెపి గెలుస్తుంది అని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పించింది.రేవంత్ రెడ్డి ఎక్కడైతే బాధ్యత తీసుకుని ప్రచారం చేస్తాడో అక్కడి బీజేపీ గెలుపు ఖాయమని కేటీఆర్ అని అన్నాడు.ఆయన స్థానిక ఎన్నికల్లో మల్కాజిగిరి మరియు మహబూబ్నగర్ లో ఆయా స్థానాల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేసింది. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యత తీసుకుంటే అక్కడ కూడా బీజేపీనే గెలిచిందని పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా వెళ్తే అక్కడ కూడా బీజేపీనే గెలిచిందని తెలిపింది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి హోదాలో క్యాంపెయిన్ చేశారని తెలిపింది. కానీ అనూహ్యంగా అక్కడ కూడా బీజేపీ అభ్యర్థినే విజయం సాధించారని..
రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ బీజేపీ గెలుస్తోందని, కాంగ్రెస్ భస్మం అవుతోందని KTR అన్నారు. ఇందులో మర్మం ఏమిటో భడే భామ్కి, ఈ చోటే భాయ్కే తెలియాలని వ్యాఖ్యానించారు. ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్న MBNR, మల్కాజ్గరి లోక్ సభ ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.