ఇకపై రేషన్ బియ్యం స్వైప్ చేసుకోపిని తీసుకోవడమే | ration card service on Whats app in AP 2025

ration card service on Whats app in AP

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని వాడడంలో ఫ్డ్ చేసినట్టుగా టెక్నాలజీని వాడుకుంటుంది.సరైన దారిలో టెక్నాలజీనీవు వాదితేయ్ ఎన్ని అద్భుతాలు చేస్తాయో ఏపీ ప్రభుత్వమే నిదర్శనం

ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇటీవల కొత్త గా స్మార్ట్ రేషన్ కార్డ్స్ ను అందువబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే ఐతే స్మార్ట్ రేషన్ కార్డ్స్ వాళ్ళ రేషన్ పంపిణి వేగంగా సులభంగా జరగడమే కాకుండా ఎలాంటి లోటు పాట్లు జరగకుండా రేషన్ పంపిణి జరుగుతుంది.రాష్ట్రం సప్లై చేసిన రేషన్ కార్డులు చాలా తప్పులు ఉన్నాయి తప్పులను సరి చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. తప్పులను గ్రామ లేదా సచివాలయంలో సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు.అంతే కాకుండా సెప్టెంబర్ 15 నుండి వాట్స్ అప్ మిత్ర ద్వారా రేషన్ కార్డులో ఉన్న తప్పులను సరి చేసుకోవడానికి వీలు కల్పించారు.ఇకపై రేషన్ కార్డులో ఉన్న తప్పులను ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోపవాల్సిన పని లేదు.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డుల్లా ఉంటాయి. వీటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది.. దీని ద్వారా రేషన్ పంపిణీ పారదర్శకంగా జరుగుతుంది. కార్డుపై లబ్ధిదారుడి వివరాలు ఉంటాయి. కార్డు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. లబ్ధిదారుడి ఫొటో, చౌక దుకాణం నంబర్ కూడా ఉంటాయి. మరోవైపు కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు తెలుస్తాయి. ఫొటోలు, అడ్రస్, డిపో ఐడీ కూడా వెంటనే తెలుస్తాయి. దీని ద్వారా రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుంది.

రేషన్ డిపోలకు కొత్త పోస్ యంత్రాలను కూడా అందించారు.ఇంతకు ముందు ఉన్న పోస్ యంత్రాలు సృక్ అవ్వడం లేదా నెట్ వర్క్ రాకపోవడం,సర్వర్ డౌన్ అవ్వడం ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో సమస్యలు వచ్చేవి దీని వలన రేషన్ సరుకులను ఇవ్వడానికి చాలా టైం ఒట్టేది ఇప్పుడు ఆలా కాకూండా కొత్త పోస్ యంత్రాలను ప్రభుత్వం రేషన్ డిపో లకు అందిస్తుంది దీని ద్వారా రేషన్ సరుకులు ఇవ్వ్వడం చాలా సులువు కానుంది యంత్రాలు ఇప్పుడు కొత్త యంత్రాలు టచ్స్క్రీన్, వైఫై, బ్లూటూత్ సదుపాయాలతో వస్తున్నాయి. కొత్త ఈ-పోస్ యంత్రాలు చాలా లేటెస్ట్గా ఉన్నాయి.. వాటికి టచ్స్క్రీన్ ఉంటుంది. వైఫై ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ అవ్వొచ్చు. బ్లూటూత్ కూడా ఉంటుంది. దీనివల్ల యంత్రాలు వేగంగా, సులువుగా పనిచేస్తాయి. ప్రజలకు సరుకులు త్వరగా అందుతాయి.

కొత్త ఈ-పోస్ యంత్రాలతో రేషన్ పంపిణీ మరింత సులభం అవుతుంది. లబ్దిదారులు ఇకపై సులభంగా సరుకులు పొందవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డు స్వైప్ చేయగానే వివరాలు తెలుస్తాయి. వేలిముద్ర పడకపోతే ఐరిస్ స్కానింగ్ ద్వారా గుర్తిస్తారు. జీపీఆర్ఎస్ ద్వారా లావాదేవీలు వెంటనే రికార్డ్ అవుతాయి. జీపీఆర్ఎస్ ఉండటం వల్ల లావాదేవీలు వెంటనే రికార్డు అవుతాయి. ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ మరింత వేగవంతంగా, పారదర్శకంగా ఉండేందుకు డిజిటల్ టెక్నాలజీని తీసుకొచ్చింది.

Leave a Comment