Ramreddy Damodar Reddy Expired in AIG Hospital
మాజీ మంత్రి వర్యులు ఐన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు రాత్రి 10.10 గంటలకు aig హాస్పిటల్ లో దూది శ్వాస విడిచారు.
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 10.10 గంటలకు తుది శ్వాస విడిచారు.
రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈయన గురించి చెప్పాల్సిన పనిలేదు మరి ముఖ్యంగా సూర్యాపేట ప్రజలకు ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఐటీశాఖ మంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా పనిచేసారూ. ఎన్నికైన నాటి నుండి ప్రజల సమస్యలకు అండగా నిలిచారు.సూర్యాపేట, నల్లగొండ ప్రాంతాల్లో సాగు నీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఆయనను ప్రజలు ప్రేమగా “టైగర్ రామ్”అని పిలుస్తుంటారు.గత కొంత కాలంగా (టైగర్ ) దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తుంగతుర్తిలోని తన ఇంట్లోనే చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు.తేదీ.03.10.2025 మధ్యాహ్నం సూర్యాపేట రెడ్ హౌస్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు 4వ తేదీన తుంగతుర్తిలో మాజీ మంత్రి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దామోదర్‌రెడ్డి మరణంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.