Ram Charan Game Changer Movie Review 2025: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ బోల్తా కొట్టిందా
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా రూపొందున పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ ఇటీవల మొదలైంది ఈ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం…
ఒక నిజాయతి గల యంగ్ ఐఏఎస్ వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాడనిది కథ యొక్క ప్రామాణికం డైరెక్టర్ శంకర్ ఒక్కడు మరియు శివాజీ లాంటి సినిమాలను తీసిన విధంగానే వ్యవస్థపై మార్పు కోసం ఈ సినిమాను తీసారని చెప్పాలి.. వీరిద్దరి ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాలను పెంచింది మరి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందా లేదా హిట్ అయిందా అనేది ఇప్పుడు చూద్దాం…
కథపరంగా చూసుకున్నట్లయితే….
ఒకే ఒక్కడు ఒక్క రోజు సీఎంని గుర్తు చేస్తూ మొదలవుతుంది ఈ సినిమా.మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికీ, రామ్నందన్కీ మధ్య మొదలయ్యే యుద్ధం సినిమాని కాస్త ఆసక్తికరంగా మారుస్తుందియువ ఐపీఎస్ అధికారి అయిన రాంనందన్ (రామ్ చరణ్) తన కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి అయినా దీపిక (కియార అద్వానీ)కోసం తన వ్యక్తిత్వాన్ని,కోపాన్ని అనుచుకొని ఐపీఎస్ గా ఉన్న తాను ఐఏఎస్ అవుతాడు.విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోగానే అభ్యుదయ పార్టీకి చెందిన మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య), అతని గ్యాంగ్తో యుద్ధం మొదలవుతుంది.మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్). పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్నందని ని అధికార బలంతో ఏం చేశాడు? సమర్థుడైన రామ్నందన్.. మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు? అభ్యుదయ పార్టీ, అప్పన్న (రామ్చరణ్), పార్వతి (అంజలి)తో రామ్నందన్కి ఉన్న సంబంధమేమిటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
యువ ఐఏఎస్ అధికారికీ, రాజకీయ నాయకుడికీ మధ్య సాగే ఓ యుద్ధం.వాస్తవికతతో కూడి సినిమాల్ని ఇష్టపడుతున్న తరం ఇది.శంకర్ మార్క్ విజువల్స్, అప్పన్న ఎపిసోడ్, కొన్ని మెరుపులు మినహా… కథనం, భావోద్వేగాల పరంగా పెద్దగా మనసుల్ని తాకలేదు.తెరపై ఇదివరకెప్పుడూ చూడని కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి. లేదంటే, వాస్తవానికి దగ్గరగా అనిపించే కథనైన చూపించాలి..శాసన వ్యవస్థ, ఎన్నికల సంఘం చుట్టూ సాగే సంఘటనల సమాహారంగా ఈ సినిమా సాగుతుంది.మీడియా, సామాజిక మాధ్యమాల హవా సాగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి? ముఖ్యమంత్రులు ఎలా ఎన్నికవుతుంటారో సామాన్యుడు సైతం తెలుసుకుంటున్నాడు. అనెడిక్టబుల్ అంటూ ఊరించిన శంకర్.ఆ నేపథ్యాన్ని 90ల్లో వచ్చిన సినిమాల్లా పూర్తి నాటకీయంగా, సహజత్వానికి దూరంగా తెరపై ఆవిష్కరించారు.రామ్నందన్ ఫ్లాష్బ్యాక్ కథని మరో దారి పట్టిస్తుంది. యాంగ్రీయంగ్ మ్యాన్గా రామ్చరణ్ కొత్త అవతారంలో కనిపించినా, ఆ నేపథ్యంలో వచ్చే ప్రేమకథ పెద్దగా మెప్పించదు.ప్రథమార్థంలో వచ్చిన ఫ్లాష్బ్యాక్ ఫర్వాలేదనిపించినా, ద్వితీయార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్లో మాత్రం శంకర్ టేకింగ్, మేకింగ్ ఆకట్టుకుంటుంది.
అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఆ క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో మంచి డ్రామా పండింది.మూడు కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపిస్తాడు. యాంగ్రీ యంగ్మ్యాన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటనని ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి.మినిస్టర్ మోపిదేవిగా ఎస్.జె. సూర్య (SJ Surya) నటన సినిమాకి హైలైట్. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే, అక్కడక్కడా నవ్వించాడు. శ్రీకాంత్ (Srikanth) కూడా రెండు లుక్స్ తో సందడి చేస్తారు.సాంకేతక విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. తిరు విజువల్స్తో ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశం గ్రాండియర్గా కనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధానబలం.
మైనస్
- రొటీన్ స్టోరీ,
- మాస్ ఎలివేషన్ సీన్స్ లేకపోవడం మైనస్.
- కామెడీ వర్కౌట్ కాలేదు.
- క్లైమాక్స్ ఫైట్ బోర్ తెప్పిస్తుంది.
- డైరెక్టర్ శంకర్ మార్క్ పాటలకే పరిమితమైంది.
ప్లస్
- BGM పర్వాలేదు
- విజువల్స్
- మ్యూజిక్
- రామ్చరణ్ నటన