private-school-fee-regulation-8-percent-hike-limit-govt-draft-details
ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పెరుగుతున్న ఫీజులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని దాదాపు 11,000 ప్రైవేట్ స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులతో పాటు, గత మూడేళ్లలో ఆయా పాఠశాలల ఆదాయ వ్యయాల (Income and Expenditure) డేటాను సేకరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలల నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం.
ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. దీని ప్రకారం, ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవలం 8% ఫీజు పెంపునకు మాత్రమే పాఠశాల యాజమాన్యాలకు అనుమతి ఉంటుంది. దీనివల్ల తల్లిదండ్రులపై అకస్మాత్తుగా పడే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలోనే ప్రతి స్కూల్ వారీగా రూపొందించిన ఫీజుల డ్రాఫ్ట్ (Draft) ను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను మరియు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ ఫీడ్-బ్యాక్ ఆధారంగా తుది ఫీజుల పట్టికను ప్రభుత్వం ఖరారు చేయనుంది. దీనివల్ల ఫీజుల నియంత్రణలో పారదర్శకత పెరగడమే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట లభించనుంది.
Follow Links
- Join Whats App Channel: Click Here
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here










