President’s rule in more days in the state
రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా PM నేతృత్వంలోని మంత్రి వర్గం సిఫార్సులతో ఆర్టికల్ 356(1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు.
రైతు ప్రస్థానం: రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా PM నేతృత్వంలోని మంత్రి వర్గం సిఫార్సులతో ఆర్టికల్ 356(1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆ తర్వాత పాలనా వ్యవహారాలను రాష్ట్రపతి సూచనతో గవర్నర్ పర్యవేక్షిస్తారు. ఆర్టికల్ 356(4) ప్రకారం 6నెలలు ఈ పాలన కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదంతో గరిష్ఠంగా 3ఏళ్లు విధించొచ్చు.మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవలే CM బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే CM ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ MLAలే విమర్శించారు. విశ్వాస పరీక్ష జరిగితే MLAలు విప్ను ధిక్కరించే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సూచనతో ఆయన తప్పుకున్నారు.