ప్రతిగీ సంవత్సరం 20 కట్టి 2 లక్షలు పొందండి | Pradhan Mantri Suraksha Bheema Yojana 2025

Pradhan Mantri Suraksha Bheema Yojana 2025

దేశంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం కేంద్రం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాల ద్వారా పేదలకు ఉపాధి హామీ, ఆర్థిక భరోసాని కల్పిస్తుంది.

కేంద్రప్రభుత్వం ఇప్పటీకే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు వందరోజుల పని కల్పిస్తోంది. ఇదే క్రమంలో జాబ్ కార్డులు ఉన్న ప్రతీ కూలికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అమలు చేస్తోంది. పథకం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం

పథకం యొక్క ముఖ్య ఉదేశ్యం

పథకం కింద ప్రతి ఒక్క జాబ్ కార్డు దారునికి ఉపాధి భీమా కల్పించడం.

పథకానికి అర్హులు

  • ఈ పథకం కింద 18 సంవత్సరాల వయసు నుంచి 70 ఏళ్ల వయసులో ఉండాలి.
  • వ్యవసాయ కూలీలు, పోస్ట్ ఆఫీస్ లలో, బ్యాంకులలో ఖాతాలు ఉన్న వారు సంబంధిత కార్యాలయాలను సంప్రదించి పీఎంఎస్బివై (PMSBY) లో నమోదు చేసుకోవాలి.
  • జాబ్ కార్డు కలిగి ఉండాలి.
  • సంవత్సరంలో ఒక నెల ఐన జాబ్ కార్డు కింద పని చేసి ఉండాలి.
భీమా ఎంత
  • ఇందులో నమోదు చేసుకునేందుకు రాతపూర్వక దరఖాస్తుతోపాటు 20 రూపాయల ప్రీమియం చెల్లించి బీమా పొందాలి.
  • జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు బీమా వర్తింపు ఈ పథకానికి సంబంధించి ప్రీమియం 12 రూపాయలుగా ఉండేది కానీ ప్రస్తుతం 20 రూపాయలకు పెరిగింది.
  • ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం యొక్క కవరేజ్ ఉంటుంది.
  • ప్రతి సంవత్సరం లబ్ధిదారుడి యొక్క సంబంధిత బ్యాంకు ఖాతా నుండి 20 రూపాయల ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది.
భీమా ఎలా అందుతుంది
  • బీమా సొమ్ము ఇలాగే ఇచ్చేది ప్రతి సంవత్సరం మే 31 నాటికి సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఉండేలా చూసుకోవాలి.
  • కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో లబ్ధిదారులు ఉపాధి పనుల ప్రదేశంలో దురదృష్టవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం పొందితే వారికి కేంద్రం రెండు లక్షల రూపాయల బీమా అందిస్తుంది.
  • పాక్షిక వైకల్యం సంభవిస్తే లక్ష రూపాయల వరకు బీమా వర్తిస్తుంది.
  • చాలామంది ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ఈ బీమా పథకం పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల వారు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు.
  • ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటిచూపు కోల్పోవడాన్ని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు.
  • దీనికి లక్ష రూపాయల బీమాను అందిస్తారు. ఉపాధి హామీ పనులు చేసే నిరుపేదలు తక్షణం ఈ పథకాన్ని పొందాలంటే పోస్టాఫీస్ , బ్యాంకులను సంప్రదించండి.
బీమా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి
  • మీరు మరణించిన 15 రోజుల వ్యవధిలోనే మీ సంభందిత పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో సంప్రదించి వ్యక్తి చనిపోయినట్టు నిర్ధారణ సర్టిఫీకేట్ పొందు పర్చాలి.
  • భీమా లబ్ధిదారుడు చనిపోతే భీమా మొత్తం నామినికి అందుతుంది.

Leave a Comment