55 రూపాయలు కట్టడం ద్వారా నెలకు 3000 రూపాయల పెన్షన్ | Pradhan Mantri Shrama Yogi Mandhan Yojana 2025

Pradhan Mantri Shrama Yogi Mandhan Yojana 2025

నిరుపేదలను లక్ష్యంగా చేసుకొని కేంద్రం వివిధ పథకాలను అందిస్తూ వారి అభ్యున్నతికి దోహదం చేస్తుంది. దీనిలో భాగంగానే కేంద్రం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.

అసంఘటిత రంగ కార్మికులకి కేంద్రం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా 60ఏళ్లు నిండిన తర్వాత అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైనా సరే నెలకు మూడువేల రూపాయల పెన్షన్ పొందే విధంగా పథకాన్ని రూపొందించింది. పెన్షన్ అందించే స్కీమ్ గురించి ప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకం కింద సరైన ఉద్యోగం లేనివాళ్లకు, వాచ్మెన్ లు, పనివాళ్ళు, మెకానిక్ లు, చెప్పులు కుట్టేవారు, చేనేత కార్మికులు, ఇలా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం తీసుకువచ్చిన పథకం.

పథకం యొక్క ముఖ్య ఉద్దేశం

అసంఘటిత కరిమికులకి 60 ఏళ్ళు దాటినా తరువాత ఆర్ధిక భరోసా కింద 3 వేల రూపాయలను అందించనుంది.

కార్మికులు అర్హులు
  • సరైన ఉద్యోగం లేనివాళ్లకు, వాచ్మెన్ లు, పనివాళ్ళు, మెకానిక్ లు, చెప్పులు కుట్టేవారు, చేనేత కార్మికులు,రైతులు,హౌస్ వైఫిస్,వీధి వ్యాపారులు ఇలా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం తీసుకువచ్చిన పథకం.
  • 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
  • ప్రతినెలా వారి ఆదాయం 15 వేలు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి.
  • ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐసీ సభ్యులు కాని వారై ఉండాలి.
ఎంత ప్రీమియం చెల్లించాలి
  • ప్రతి నెల 55 నుంచి 200 రూపాయలు వరకు చెల్లించాలి.
  • 60 ఏళ్ల తర్వాత దర్జాగా ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ పొందవచ్చు.
ఎలా అందుతుంది..
  • ఒకవేళ పెన్షన్ తీసుకునే వ్యక్తి ఏ కారణాలతో నైనా మరణిస్తే అందులో 50 శాతం పెన్షన్ భార్యకు లేదా భర్తకు వస్తుంది.
  • ఈ పథకంలో ఒకసారి దరఖాస్తు చేసుకునే వారు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతినెల కచ్చితంగా బ్యాంకు నిర్దేశించిన మేరకు డబ్బులు చెల్లించాలి.
  • 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్
  • ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు
  • సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం
  • వాయిదాలు ఆటోమేటిగ్గా కట్ కావటానికి అనుమతి పత్రాన్ని తీసుకోవాలి.

ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి పి ఎం ఎస్ వై ఎం స్కీం అధికారిక వెబ్సైట్ Apply Now లో లాగిన్ అయ్యి, సంబంధిత వివరాలను నమోదు చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ఆపై ప్రతినెల బ్యాంకుకు ప్రీమియం కట్టాలి. అప్పుడే ప్రతి నెల 3000 రూపాయలను పెన్షన్ గా పొందవచ్చు.

Leave a Comment