PM modi good news to janapanaara farmers : ఈ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన పీఎం మోడీ గిట్టుబాటు ధర పెంపు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ నిర్వహించింది ఈ మీటింగ్ లో జనపనార రైతులకు వీటిని చెప్పారు పీఎం మోడీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కొకటిగా రైతులకు అందే విధంగా గిట్టుబాటు ధరను కల్పిస్తూ వస్తున్నారు అయితే ఈ గిట్టుబాటు ధర పంటకు ఉన్న రేటు కన్నా కొద్దిగా పెంచారు.2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ముడి జనపనార (Raw Jute) కనీస మద్దతు ధర (MSP) పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం జనపనార రైతులకు ఆర్థికంగా ఊరట ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో మరింత ఎక్కువగా పంటను పండించేందుకు ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి..
కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం, 2025-26 సీజన్‌లో ముడి జనపనార (టీడీ-3 గ్రేడ్) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 5,650 గా నిర్ణయించారు. గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో కేంద్ర ప్రభుత్వం 315 రూపాయలను ఎక్కువ పెంచింది.గత ఏడాది 1.70 లక్షల మంది రైతుల నుంచి జనపనారను కొనుగోలు చేశారు, వీరిలో 82 శాతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. అస్సాం, బీహార్ రాష్ట్రాలు కలిసి జనపనార ఉత్పత్తిలో 9 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, 2014-15 నుంచి 2024-25 వరకు జనపనార రైతులకు రూ. 1,300 కోట్ల ఎంఎస్పీ చెల్లింపులు జరిపింది. దీనితో పోలిస్తే, 2004-05 నుంచి 2013-14 మధ్య కేవలం రూ. 441 కోట్లు మాత్రమే చెల్లించబడింది. ఈ గణాంకాలు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడడానికి మద్దతు ధరలు ఎంత ప్రభావం చూపుతాయో స్పష్టంగా చూపిస్తున్నాయి.