PM Greets Every on Basant Panchami puja
వసంత పంచమి ఈ తిథిని భారత ప్రజలు శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు.మాఘ శుద్ధ నాడు ఈ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు.వసంత పంచమి నీ బాసరలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఇది సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా ఈ పంచామిని జరుపుకుంటారు.
వసంత పంచమి విశిష్టత
రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. “మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను” అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
ఈ పంచమి మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నముగా భావిస్తారు.ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.సరస్వతి ఆరాధన వల్ల అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 కేంద్ర బడ్జెట్‌ను భారతదేశ పురోగతి కోసం గేమ్‌చేంజర్‌గా అభివర్ణించారు, విక్షిత్ భారత్ వైపు దేశం యొక్క ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో దాని పాత్రను నొక్కిచెప్పారు.AI, బొమ్మల తయారీ, వ్యవసాయం, పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు గిగ్ ఎకానమీతో సహా బహుళ రంగాలలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు స్థిరమైన వృద్ధికి యూనియన్ బడ్జెట్ మార్గం సుగమం చేస్తుంది.MyGov ద్వారా X పోస్ట్ థ్రెడ్‌కు ప్రతిస్పందిస్తూ, PM మోడీ ఇలా వ్రాశారు “విక్షిత్ భారత్‌ను నిర్మించాలనే మా సమిష్టి సంకల్పానికి ఊపందుకునే బడ్జెట్! #ViksitBharatBudget2025”
FAQ