PM Good news to Farmers New Scheme Announced: దేశంలోని రైతులందరికీ ఈ కార్డులు 2025
రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆర్థికంగా మరియు పరోక్షంగా ఆదుకుంటూ వస్తూ ఉన్నాయి. దీంట్లో చాలామందికి పథకాలు అందగా పోవడంతో ప్రధానమంత్రి కొత్త ఆలోచన చేశారు..

దేశంలో రైతులను ఆర్థికంగా ఆదుకుంటూ రైతులను దేశానికి వెన్నుముక చేస్తోంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తోంది.. ఎంతో పకడ్బందీగా పథకాలను అమలు చేస్తున్న కూడా చాలామంది రైతులకు పథకాలు అందకుండా పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయం ద్వారా రైతులకు మంచి ఏం జరుగుతుందని చెప్తుంది దీంతో రైతులు వర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.. దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్న మాదిరిగా ప్రతి ఒక్క రైతుకు ప్రత్యేక కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది దీన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు..దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రత్యేక కార్డులు ఇవ్వబోతోంది. అన్నదాతలకు అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేందుకు ఆధార్ తరహాలో ఈ కార్డు అందించనున్నారు. ఇది యూనిక్ గుర్తింపు సంఖ్యతో ఉండనుంది.

ప్రతి ఒక్క రైతుకు సంక్షేమ పథకాలు అందాలు అనే దశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.దేశంలోని రైతులందరికీ ఈ కార్డు అందజేయనున్నారు. అతి త్వరలో ఈ కార్డుల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారని సమాచారం. దీని కోసమే ప్రతి రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించండి.అన్ని రాష్ట్రాల్లో రైతులకు ఈ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించింది. అన్ని శాఖల సమన్వయంతో ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను(PMU) ఏర్పాటు చేయాలని పేర్కొంది…

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా పీఎంయూ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన పిఎంయుకు అన్నదాత సమాచారం ఎలా సేకరించాలి అన్నదానిపై విధి విధానాలను ఏర్పాటు చేయనుంది.ఈ ప్రత్యేక కార్డులను వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. పంటలను రైతులు కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, ఇతర పథకాల అమలు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది.రైతులకు సంబంధించిన మొత్తం సమాచారం సేకరించి ఈ కార్డులతో డిజిటలీకరణ చేయాలని కేంద్రం భావిస్తోంది. రైతు వేసే పంటలు, పశుసంపద, అందుకుంటున్న పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం ఈ కార్డుల్లో నిక్షిప్తం కానుందట. తద్వారా అన్నదాతలకు అన్ని స్కీమ్స్ చేరువ అవుతాయని అంటున్నారు.
 
			









