BC Commission Changed Some Cast Names : ఈ రోజుల్లో కూడా కొన్ని కులాల పేర్లను వాడికి తిట్ల పేర్లుగా మలుస్తున్నారని 2025
రాష్ట్రంలో కొన్ని కులాల పేర్లు మార్పునకు బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆ కులాల పేర్లను తిట్టు పదాలుగా వాడుతున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ రోజుల్లో కూడా కొన్ని కులాల పేర్లను వాడికి తిట్ల పేర్లుగా మలుస్తున్నారని సినిమాల్లో, రాజకీయాల్లో కూడా ఈ పదాలను వాడుతున్నారని బీసీ కమిషన్ ఆ కులాల పేర్ల మార్పుకు నోటిఫికేషన్ జారీ చేసింది.. దీంతో ఆయా కులాల వాళ్ళు బాధపడుతున్నారని తమను కించపరిచే విధంగా ఆ కులాల పేర్లు వాడుతున్నారని ఆవేదన చెందుతున్నారని తెలిపారు.చులకనభావంగా చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లు మార్చాలని కొన్ని కులాల ప్రతినిధులు ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ మేరకు బీసీ కమిషన్‌కు పలు సంఘాలు విజ్ఞప్తి కూడా చేశాయి. బీసీ కమిషన్ లో ఉన్న ఎనిమిది కులాల ఆపే లను మార్చి వారికి పర్యాయపదాలుగా ఉన్న కొన్ని పదాలను వాడాలని బీసీ కమిషన్ సూచించింది.కొన్ని పేర్లను సమాజంలో చులకనగా వినియోగిస్తున్నారని.. వాటిని మార్చాలని కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో తేలింది. బీసీ కమిషన్ కార్యాలయంలోనూ పలువురు విన్నవించారు. కుల సంఘాల ప్రతినిధులతో బీసీ కమిషన్ ఇప్పటికే ప్రాథమిక చర్చలు నిర్వహించింది.
![BC Commission Changed Some Cast Names : ఈ రోజుల్లో కూడా కొన్ని కులాల పేర్లను వాడికి తిట్ల పేర్లుగా మలుస్తున్నారని 2025 1 BC Commission](https://rythuprasthanam.com/wp-content/uploads/2025/01/112-300x144.jpg)
పేర్లు మార్చిన కులాలు ఇవే
- రజక (చాకలి, వన్నర్)- వన్నర్ తొలగించి దోబి పర్యాయపదం చేర్పు
- వంశరాజ్ / పిచ్చగుంట్ల (బీసీ ఏ)- పిచ్చగుంట్ల తొలగింపు
- దొమ్మర (బీసీ ఏ) – గాంద వంశీయ
- బుడబుక్కల- ఆరె క్షత్రియ జోషి / శివ క్షత్రియ/ రామజోషి
- కుమ్మర లేదా కులాల, శాలివాహన- ప్రజాపతి పర్యాయ పదం చేర్పు
- చిప్పోళ్లు (మేర)- మేర
- వీరముష్ఠి (నెట్టికొటాల), వీరభద్రీయ- వీరభద్రీయ
- తమ్మలి (బ్రాహ్మణేతరులు, శూద్రులు) – బ్రాహ్మణేతర, శూద్ర పదాల తొలగింపు