Organic Medicine preparation of Meenamrutham: మీనామృతం వలన ఇన్ని ఉపయోగాల ? 2024

Photo of author

By Admin

Table of Contents

Organic Medicine preparation of Meenamrutham: మీనామృతం వలన ఇన్ని ఉపయోగాల ?

అగ్రికల్చర్ వ్యవసాయంలో ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులను రైతులు తీసుకొస్తూ ఉన్నారు. దీని ద్వారా భూమికి మేలు జరగడంతో పాటు ఎలాంటి కెమికల్స్ వాడకుండా భూమి సారా ని కాపాడుతూ వస్తున్నారు.అందులో భాగంగా ఈరోజు మనం మీనామృతం యొక్క తయారీ విధానాన్ని దాని యొక్క వినియోగం గురించి చూద్దాం…

ఈ మీనామృతం తయారీలో భాగంగా మనం తాజా చేప ముక్కలకి దేశీయ ఆవు మూత్రము, దేశీయ ఆవు నెయ్యి, తేనెను కలిపి దాంతోపాటుగా తాటికలను కూడా కలపడం జరుగుతూ ఉంటుంది.అలా తయారైన ఈ మీనామృతం అనేది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది.దానిని మనం పంటకు పారిస్తే పంట ఎదుగుదలతో పాటుగా పోషక వివాలను కూడా అందించిన వాళ్ళం అవుతాం…కాబట్టి దీనిని మనం వాడుకోవడం వలన పంట నాణ్యతను పెంపొందిస్తూ అదేవిధంగా అధిక దిగుబడికి ఈ దోహదం చేస్తూ ఉంటుంది… ఇప్పుడు మనం ఈ మీనామృతం యొక్క తయారీ విధానాన్ని వ్యవసాయంలో దాని యొక్క వినియోగాన్ని చూద్దాం…

తయారీకి కావలసిన పదార్థాలు

  • KG చేప ముక్కలు
  • ఐదు లీటర్ల దేశీయ ఆవు మూత్రం
  • ఒక లీటర్ తాటికల్లు
  • ఒక కేజీ నల్ల బెల్లం
  • 50 గ్రాముల తేనె
  • 50 గ్రాముల దేశీయ ఆవు నెయ్యి

తయారీ విధానం

  • మొదటగా సేకరించిన చేప ముక్కలను నల్లబెల్లం పొడిని కలిపి ఒక అరగంట సేపు అదే విధంగా ఉంచాలి.
  • తరువాత దీనికి నల్ల బెల్లం కలిపినటువంటి చేప ముక్కలను కుండలో వేసుకోవాలి.
  • వేసుకుని బాగా కలిపి ఆ మీనామృతాన్ని పది రోజులు ఒక జాడీలో ఉంచి మూతి ఒక సన్నని దారం లేదా సుతిని పోసథో గాలి వెళ్లకుండా  కట్టాలి. పది రోజులు బాగా మరిగిన మీనాఅమృతాన్ని వడగట్టుకోవాలి.
  • ఆ తరువాత వడగట్టుకున్న మీనామృతానికి 50 గ్రాముల ఒక లీటర్ కళ్ళు
  • 50 గ్రాముల తేనె
  • 50 గ్రాముల దేశి ఆవు నెయ్యి కలుపుకోవాలి.

ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మొత్తం మిశ్రమాన్ని మూత పెట్టి మరో పది రోజులు మురుగనిస్తే మనకు మీనామృతం అనేది తయారవుతుంది.

ఉపయోగాలు

ఇది సూక్ష్మ మరియు స్థూల పోషకాలను పంటకందించి పంట పెరుగుదల లోపల ప్రధాన భూమిక పోషిస్తుంది. దీన్ని ప్రకృతి రైతులు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మీరు కూడా ఈ పద్ధతిని పాటించి దీని యొక్క లాభాలు పొందండి పంట యొక్క దిగుబడిన పెంపొందించండి ప్రకృతి వ్యవసాయం చేయండి.

Credit: Dheerghaayush You tube Channel link Provided in this channel.

Leave a Comment