Nirmala Sitharaman Vs Revanth Reddy in Delhi తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదల
హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిన విషయాన్ని తెలియజేశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. 9 జిల్లాలకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదలకు అంగీకరించిన అంశాన్ని వారి దృష్టికి తెచ్చిన ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఎంపీలతో కలిసి పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారి చాంబర్ లో రేవంత్ కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై వినతిపత్రాలను అందజేశారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిన విషయాన్ని తెలియజేశారు.
ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహణకు రూ.703.43 కోట్లను తెలంగాణ భరించిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ.408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ మొత్తం చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపినప్పటికీ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ సైతం ఆ ఏపీకి లేఖలు రాసినట్టు గుర్తుచేశారు. వడ్డీతో సహా ఆ మొత్తం తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని సీఎంగారు కోరారు.ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి రూ.2,547.07 కోట్ల రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని, ఆ విషయంపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎంగారు కోరారు.
2014-15 లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులను కేంద్రం కేవలం ఏపీకి మాత్రమే కేటాయించిందని గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు రూ.495.20 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని, నిధులు ఇప్పించేలా ఆ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.ముఖ్యమంత్రి గారి వెంట కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, కుందూరు రఘువీర్ గారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పాల్గొన్నారు.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.